Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: బుమ్రా.. ఎందుకింత అహంకారం?

ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకింత అహంకారం? అని ప్రశ్నిస్తున్నారు. ఎంత స్టార్ పేసర్ అయినా.. గొప్ప వ్యక్తిత్వం లేకపోతే ఎలా? అని మండిపడుతున్నారు. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

అయితే ఈ మ్యాచ్‌లో బుమ్రా వ్యవహరించిన తీరు సోషల్ మీడియా వేదికగా విమర్శలకు దారి తీసింది. బుమ్రా బౌలింగ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇంపాక్ట్ ప్లేయర్ అభినవ్ మనోహర్ భారీ సిక్సర్ కొట్టాడు. దాంతో తీవ్ర అసహనానికి గురైన బుమ్రా.. ఆ మరుసటి బంతిని ఫుల్ టాస్ సంధించాడు. బంతి కాస్త స్లోగా వేయడంతో అది నేరుగా అభినవ్ మనోహర్ పొట్టకు తాకింది.

IPL 2025 Jasprit Bumrah Brutally trolled for his arrogant behaviour on field against Abhinav Manohar

ఆ బంతి ధాటికి అతను క్రీజులో కుప్పకూలాడు. కానీ వెంటనే తేరుకొని బ్యాటింగ్‌కు సిద్దమయ్యాడు. కానీ, బుమ్రా మాత్రం అభినవ్ మనోహర్‌కు ఏమైందని కూడా అడగలేదు. పట్టిచ్చుకోకుండా మరో బంతి వేసేందుకు సిద్దమయ్యాడు. ఈ ఘటన నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. బుమ్రాకు ఇంత అహంకారం ఏందుకు? అతను ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడని నెటిజన్లు మండిపడుతున్నారు.

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లోనూ బుమ్రా బౌలింగ్‌లో కరుణ్ నాయర్ సిక్సర్లు కొట్టాడు. అప్పుడు కూడా బుమ్రా అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. కరుణ్ నాయర్‌తో వాగ్వాదానికి దిగాడు. తాజాగా అభినవ్ మనోహర్‌ పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. దాంతో సోషల్ మీడియా వేదకిగా బుమ్రాపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

'బుమ్రా తీరు సరైనది కాదు. అతని బౌలింగ్‌లో ఎవరైనా సిక్స్‌లు కొడితే తట్టుకోలేడు. ఫుల్ టాస్ బాల్ అభినవ్ మనోహర్‌కు తాకినప్పుడు.. ఎలా ఉంది? అని అడగడం కనీస మానవత్వం. కానీ బుమ్రా అహంకారపూరితంగా ప్రవర్తిస్తున్నాడు.'అని ఓ నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. గాయం నుంచి ఇటీవలే కోలుకున్న జస్‌ప్రీత్ బుమ్రా.. ఇంకా పూర్తి సామర్థ్యం అందుకోలేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Story first published: Thursday, April 24, 2025, 15:30 [IST]
Other articles published on Apr 24, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+