For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Vaibhav Suryavanshi ఒక్కడే కాదు.. కోహ్లీ, ధోనీ, రోహిత్ కూడా మోసకారులే!

రాజస్థాన్ రాయల్స్ చిచ్చర పిడుగు, ఐపీఎల్ బుడ్డోడు వైభవ్ సూర్యవంశీ వయసుపై తీవ్ర చర్చ జరుగుతోంది. 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేసి సరికొత్త చరిత్ర సృష్టించిన ఈ బిహార్ కుర్రాడు.. తొలి బంతినే సిక్సర్‌గా మలిచి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా యశస్వి జైస్వాల్‌తో కలిసి ఓపెనింగ్ చేసిన సూర్యవంశీ.. విధ్వంసకర బ్యాటింగ్‌తో అందర్నీ ఆకట్టుకున్నాడు.

20 బంతుల్లో 2 ఫోర్లు 3 సిక్స్‌లతో 34 పరుగులు చేసిన సూర్యవంశీ స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. ఔటైన అనంతరం ఉబికి వస్తున్న దు:ఖాన్ని ఆపుకోలేక కన్నీటి పర్యంతమయ్యాడు. 14 ఏళ్ల వయసే అయినా.. తన ఆటలో ఎంతో మెచ్యూరిటీ చూపించాడు. ఈ ప్రదర్శనతో ఈ కుర్రాడు టాక్ ఆఫ్ ది నేషన్‌గా నిలిచాడు. అతని ఆటకు ఫిదా అయిన నెటిజన్లు ఓ వైపు ప్రశంసల జల్లు కురిపిస్తుంటే.. మరోవైపు అతని వయసుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

IPL 2025 India s 14-Year-Old Sensation Vaibhav Suryavanshi Accused Of Age Fraud By Netizens

వైభవ్ సూర్యవంశీ ఏజ్ ఫ్రాడ్..?
వైభవ్ సూర్యవంశీ చూడటానికి 14 ఏళ్ల వయసు పిల్లాడిలా లేడని, అతనికి కచ్చితంగా 16 నుంచి 17 ఏళ్ల వయసు ఉంటుందని మెజార్టీ ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్థాన్ మీడియా అయితే వైభవ్ సూర్యవంశీ వయసు 14 ఏళ్లు అంటే నమ్మశక్యంగా లేదని విమర్శలు గుప్తిస్తూ వరుస కథనాలు ప్రచురించింది. దాంతో క్రికెటర్ల ఏజ్ ఫ్రాడ్ గురించి సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే క్రికెటర్లు ఒకటి, రెండేళ్లు తక్కువగా చెప్పడం సాధారణమేనని, ఏజ్ క్రికెట్‌లో కొనసాగేందుకు.. ప్రభుత్వ ఉద్యోగాల కోసం చాలా మంది తమ వయసును తక్కువగా రాయించుకుంటారని పేరు చెప్పడానికి ఇష్టపడిన ఓ బీసీసీఐ అధికారి మీడియాతో అన్నారు.

కోహ్లీ, ధోనీ సైతం..
అయితే 1-2 ఏళ్ల కంటే ఎక్కువ ఏజ్ ఫ్రాడ్ చేయలేరని సదరు అధికారి నొక్కి చెప్పాడు. వైభవ్ సూర్యవంశీ ఒక్కడే కాదని విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మలతో పాటు ఎంతో మంది స్టార్ ఆటగాళ్లు సైతం ఒకటి, రెండేళ్లు తక్కువ రాయించుకున్నవారేనని సదరు అధికారి చెప్పుకొచ్చారు. నార్త్ ఇండియా క్రికెటర్లలో ఇది సర్వ సాధారణమని, 1-2 ఏళ్లు ఏజ్ ఫ్రాడ్ చేస్తే కనిపెట్టడం కూడా కష్టమేనన్నారు.

'నార్త్ ఇండియా క్రికెటర్లలో చాలా మంది తమ వయసు ఒకటి-రెండేళ్లు తగ్గించుకుంటారు. ఇది సాధారణమైన విషయం. ఉద్యోగ అవకాశాలు, ఏజ్ క్రికెట్ ఆడటం కోసం ఇలా చేస్తారు. భారత స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మ, మహమ్మద్ షమీలు కూడా ఇలా ఒకటి, రెండేళ్లు తమ వయసును తగ్గించుకునేవాళ్లే. 1-2 ఏళ్లు తగ్గించుకుంటే ఏ టెస్ట్‌ కూడా కనిపెట్టలేదు. అంత కంటే ఎక్కువ ఫ్రాడ్ చేస్తే మాత్రం దొరికిపోతారు. వైభవ్ సూర్యవంశీ కూడా తన వయసు 1 లేదా రెండేళ్లు తక్కువగా చెప్పొచ్చు. ఇదేం పెద్ద సమస్య కాదు. అతను బాగా ఆడుతున్నాడా? లేదా? అన్నదే ముఖ్యం.'అని సదరు అధికారి అభిప్రాయపడ్డారు.

ఏ టెస్ట్‌కు అయినా రెడీ..
తన కొడుకు వయసుపై వస్తున్న ఆరోపణలపై వైభవ్ సూర్యవంశీ తండ్రి సంజీవ్ గతంలోనే స్పందించారు. తన కొడుకు ఎలాంటి ఏజ్ ఫ్రాడ్ చేయలేదని, 8 ఏళ్ల వయసులోనే బీసీసీఐ బోన్ టెస్ట్‌కు హాజరయ్యాడని చెప్పాడు. మరోసారి టెస్ట్ చేయాలనుకుంటే చేసుకోవచ్చని సవాల్ విసిరాడు. '8 ఏళ్ల వయసు ఉన్నప్పుడే వైభవ్ సూర్యవంశీకీ బీసీసీఐ బోన్ టెస్ట్ జరిగింది. ఇప్పటికే అతను అండర్ 19 జట్టు తరఫున ఆడాడు. మేం ఎవరికీ భయపడం. మళ్లీ వయసు నిర్దారిత పరీక్ష చేయించుకునేందుకు సూర్య సిద్దం'అని సంజీవ్ స్పష్టం చేశాడు.

Story first published: Monday, April 21, 2025, 15:17 [IST]
Other articles published on Apr 21, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+