Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: బీసీసీఐ సంచలన నిర్ణయం.. విదేశీ ఆటగాళ్ల భారీ ధరకు చెక్!

ఐపీఎల్ 2025 మెగా వేలానికి సంబంధించిన రిటెన్షన్ పాలసీని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఖరారు చేసింది. ప్రతీ ఫ్రాంచైజీ ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు అనుమతిచ్చింది. ఇందులో ఒక రైట్ టు మ్యాచ్(ఆర్‌టీఎం) కార్డ్ ఉంది. అట్టిపెట్టుకున్న ఐదుగురి ఆటగాళ్ల కోసం రూ.75 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

ప్రతీ జట్టు పర్స్ వాల్యూను రూ. 120 కోట్లకు పెంచారు. ఐపీఎల్ 2025 సీజన్ నుంచి ఆటగాళ్లందరికీ ప్రతీ మ్యాచ్‌కు రూ. 7.50 లక్షల మ్యాచ్ ఫీజు అందించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. అన్నీ లీగ్ మ్యాచ్‌లు ఆడిన ఆటగాడికి అదనంగా రూ. 1.05 కోట్ల ఆదాయం లభిస్తోంది. ప్రతీ ఫ్రాంచైజీ ఈ ఫీజు కోసం రూ. 12.60 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. పర్స్ వాల్యూకు ఇది అదనం.

IPL 2025 Indian Players determine foreigners salary in the IPL

రిటైన్ చేసుకునే ఆటగాళ్లకు వరుసగా రూ. 18 కోట్లు, రూ. 14 కోట్లు, రూ. 11 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. నాలుగు, ఐదో ఆటగాడిని తీసుకోవాలనుకుంటే తిరిగి రూ. 18 కోట్లు, రూ. 14 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఐదుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంటే రూ. 45 కోట్లు మాత్రమే మిగులుతాయి. ఈ డబ్బుతోనే ఆర్‌టీఎమ్‌తో పాటు 15 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

విదేశీ ఆటగాళ్ల విషయంలో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏ ఆటగాడైనా వేలానికి పేరు నమోదు చేసుకొని, జట్టు కొనుక్కున్నాక.. సీజన్ ఆరంభానికి ముందు తాను అందుబాటులో ఉండనని చెబితే అతనిపై రెండేళ్ల పాటు నిషేధం కొనసాగనుంది. గాయాలైన ఆటగాళ్లకు మాత్రం మినహాయింపు ఉంటుంది.

అంతేకాకుండా భారత ఆటగాళ్ల కంటే విదేశీ ఆటగాళ్లు ఎక్కువ డబ్బులు రాకుండా కూడా బీసీసీఐ రూల్స్ మార్చింది. ఐపీఎల్ 2025లో ఓ భారత ఆటగాడు అత్యధికంగా రూ. 18 కోట్లు పలికితే ఐపీఎల్ 2026 మినీవేలంలో విదేశీ ఆటగాళ్లు అంతకంటే ఎక్కువ ధర దక్కించుకున్నా వారికి రూ. 18 కోట్లు మాత్రమే దక్కుతాయి. మిగిలిన డబ్బులను బీసీసీఐ తీసుకొని ఆటగాళ్ల సంక్షేమం కోసం ఖర్చు చేయనుంది.

ఎక్కువ ధర దక్కించుకునేందుకు కొంతమంది ఫారిన్ ఆటగాళ్లు మెగా వేలంలో పాల్గొనకుండా మినీ వేలంలో బరిలోకి దిగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఉదాహరణకు ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఓ భారత ఆటగాడు అత్యధికంగా రూ. 18 కోట్లు పలికాడు అనుకుంటే.. ఐపీఎల్ 2026 మినీవేలంలో విదేశీ ప్లేయర్ రూ. 25 కోట్లు పలికినా అతనికి రూ. 18 కోట్లు మాత్రమే దక్కుతాయి. మిగిలిన రూ. 7 కోట్లు బీసీసీఐ తీసుకొని ఆటగాళ్ల సంక్షేమం కోసం ఖర్చు చేయనుంది.

Story first published: Sunday, September 29, 2024, 12:10 [IST]
Other articles published on Sep 29, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+