ఎప్పుడెప్పుడా? అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2025 సీజన్‌కు రంగం సిద్దమైంది. మరో 48 గంటల్లో ఈ క్యాష్ రిచ్ లీగ్‌కు తెరలేవనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య కోల్‌కతాలోని ఐకానిక్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుండగా.. 7 గంటలకే టాస్ వేయనున్నారు.
తొలి మ్యాచ్ ప్రారంభానికి ముందు ఐపీఎల్ ఆరంభ వేడుకలను నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటల నుంచే ఈ ఆరంభ వేడుకలు ప్రారంభం కానున్నాయి. బాలీవుడ్ అందాల భామ దిశ పఠాని డ్యాన్స్‌తో సందడి చేయనుండగా.. ప్రముఖ సింగర్ శ్రేయ ఘోషల్ తన గాత్రంతో అలరించనుంది.

ఫ్రీగా చూడాలంటే..?
ఐపీఎల్‌కు స్టార్ స్పోర్ట్స్‌తో పాటు జియో హాట్‌స్టార్ అధికారిక బ్రాడ్‌కాస్టర్‌గా వ్యవహరించనున్నాయి. స్టార్ స్పోర్ట్స్‌కు చెందిన అన్ని ఛానెల్‌లో ఈ మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. అయితే ఈ మ్యాచ్‌ను ఫ్రీగా చూసే వెసులు బాటు లేదు. జియోసినిమా, హాట్‌స్టార్ కలిసి జియోహాట్‌స్టార్‌గా మారడంతో ఉచిత వీక్షణలను ఎత్తివేసారు. తప్పనిసరి సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలనే నియమం పెట్టారు. అయితే జియో రిఛార్జ్‌ను 299 కంటే ఎక్కువ ప్లాన్‌తో రిఛార్జ్ చేసుకుంటే మాత్రం మొబైల్‌లో జియో హాట్‌స్టార్‌లో మ్యాచ్‌లు వీక్షించవచ్చు. లేదంటే జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే.
హోరాహోరీ పోరు..
తొలి పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్ హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. సొంతగడ్డపై ఈ మ్యాచ్ జరుగుతుండటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. టీమ్‌లో దూకుడైన బ్యాటర్లతో పాటు మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తీలు ఉన్నారు. అజింక్యా రహానే సారథ్యంలో కేకేఆర్ ఈ సీజన్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది.
మరోవైపు ఆర్‌సీబీ కూడా పటిష్టంగానే ఉంది. విరాట్ కోహ్లీతో పాటు ఫిట్ సాల్ట్, రజత్ పటీదార్, లియామ్ లివింగ్ స్టోన్, జితేశ్ శర్మ, టీమ్ డేవిడ్, కృనాల్ పాండ్యాలతో భీకరంగా ఉంది. భువనేశ్వర్ కుమార్, జోష్ హజెల్ వుడ్, యశ్ దయాల్‌తో బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగానే ఉంది. దాంతో తొలిపోరే అభిమానులను అలరించనుంది.
తుది జట్లు(అంచనా)
ఆర్‌సీబీ: విరాట్ కోహ్లీ(కెప్టెన్), ఫిల్ సాల్ట్, రజత్ పటీదార్, లియామ్ లివింగ్ స్టోన్, జితేశ్ శర్మ(కీపర్), టీమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, రసిక్ సలామ్, భువనేశ్వర్ కుమార్, జోష్ హజెల్ వుడ్, యశ్ దయాల్.
కేకేఆర్: క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, అజింక్య రహానె (కెప్టెన్), వెంకటేశ్ అయ్యర్, రమణ్ దీప్ సింగ్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, ఉమ్రాన్ మాలిక్, అన్రిచ్ నోర్జే.