Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: గుజరాత్ చేతిలో ఘోర పరాజయం.. కేకేఆర్ ప్లే ఆఫ్స్ చేరాలంటే..?

ఐపీఎల్ 2025 సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) పరాజయాల పరంపర కొనసాగుతోంది. వరుసగా రెండో మ్యాచ్‌లో కేకేఆర్ ఓటమిపాలైంది. గుజరాత్ టైటాన్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన కేకేఆర్ 39 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 198 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్(55 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 90), సాయి సుదర్శన్(36 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 52) హాఫ్ సెంచరీలతో రాణించగా.. జోస్ బట్లర్(23 బంతుల్లో 8 ఫోర్లతో 41 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.

కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, ఆండ్రీ రస్సెల్ తలో వికెట్ తీసారు. అనంతరం కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 159 పరుగులే చేసింది. అజింక్యా రహానే(36 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 50) మినహా అంతా విఫలమయ్యారు. వెంకటేశ్ అయ్యర్(14), రింకూ సింగ్(17), ఆండ్రీ రస్సెల్(21), రమణ్‌దీప్ సింగ్(1) వైఫల్యం కేకేఆర్ కొంపముంచింది. గుజరాత్ బౌలర్లలో మహమ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మ, వాషింగ్టన్ సుందర్, సాయి కిషోర్ తలో వికెట్ తీయగా.. ప్రసిధ్ కృష్ణ, రషీద్ ఖాన్ రెండేసి వికెట్లు పడగొట్టారు.

IPL 2025 How can KKR still qualify for the playoffs after 39 runs loss against GT

ప్లే ఆఫ్స్ చేరాలంటే..?
ఇది కేకేఆర్‌కు ఐదో పరాజయం. ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన కేకేఆర్.. మూడు విజయాలు మాత్రమే నమోదు చేసి పాయింట్స్ టేబుల్‌లో ఏడో స్థానంలో కొనసాగుతోంది. కేకేఆర్ నెట్‌రన్‌రేట్(0.212)మెరుగ్గానే ఉంది. ఈ సీజన్‌లో కేకేఆర్ ఇంకా 6 లీగ్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. కేకేఆర్ ప్లే ఆఫ్స్ చేరాలంటే ఈ 6 మ్యాచ్‌ల్లో ఐదు గెలవాలి. అప్పుడే 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది. ఒక్క మ్యాచ్ ఓడినా.. ఇతర జట్ల ఫలితాలు, నెట్‌రన్‌రేట్‌పై ఆధారపడాల్సి ఉంటుంది. మూడు ఓడితే మాత్రం అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమిస్తోంది.

కేకేఆర్ తదుపరి మ్యాచ్‌లు..?
కేకేఆర్ తమ తదుపరి మ్యాచ్‌లను పంజాబ్ కింగ్స్(ఏప్రిల్ 26), ఢిల్లీ క్యాపిటల్స్(ఏప్రిల్ 29), రాజస్థాన్ రాయల్స్(మే 4), సీఎస్‌కే(మే7), సన్‌రైజర్స్ హైదరాబాద్(మే 10), ఆర్‌సీబీ(మే 17)లతో తలపడనుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగం చెలరేగితేనే ఆ జట్టుకు విజయాలు దక్కనున్నాయి. వరుణ్ చక్రవర్తీ, రస్సెల్ వైఫల్యం ఆ జట్టు విజయవకాశాలను దెబ్బతీస్తోంది. ఈ ఇద్దరూ చెలరేగితే కేకేఆర్‌కు తిరుగుండదు.

Story first published: Tuesday, April 22, 2025, 8:08 [IST]
Other articles published on Apr 22, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+