Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: శుభ్‌మన్‌ గిల్‌తో ఈగో క్లాష్.. హార్దిక్ పాండ్యా ఏమన్నాడంటే..?

టీమిండియా నయా టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్‌ గిల్‌తో విభేదాలు అంటూ వచ్చిన వార్తలపై ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. శుభ్‌మన్ గిల్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశాడు. తమ మధ్య మంచి అనుబంధం, ప్రేమ మాత్రమే ఉన్నాయని పేర్కొన్నాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 20 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

అయితే ఈ మ్యాచ్ సందర్భంగా శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా ఒకరినొకరు చూసుకోకపోవడం, విష్ చేసుకోకపోవడం చర్చనీయాంశమైంది. టాస్ సందర్భంగా ఈ ఇద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదని, ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. హార్దిక్ పాండ్యా షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ప్రయత్నించినా.. గిల్ పట్టించుకోకుండా పక్కకు వెళ్లిపోయాడని, ఆ తర్వాత గిల్ ఔటైనప్పుడు హార్దిక్ దూకుడుగా సెలబ్రేట్ చేసుకున్నాడని నెటిజన్లు కామెంట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలను కూడా వైరల్ చేశారు. దాంతో ఈ ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని చాలా మంది భావించారు.

IPL 2025 Hardik Pandya s Reaction to Shubman Gill s Post Perfectly Summarizes Their Rift
Photo Credit: IPL twitter (X)

టీమిండియా కెప్టెన్సీ విషయంలోనే ఇద్దరి మధ్య ఇగో క్లాష్ మొదలైందని చాలా మంది అనుకున్నారు. అయితే, ఈ ప్రచారంపై శుభ్‌మన్ గిల్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించాడు. హార్దిక్ పాండ్యాతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసిన శుభ్‌మన్ గిల్.. తమ మధ్య మంచి అనుబంధం, ప్రేమ మాత్రమే ఉన్నాయని స్పష్టం చేశాడు. 'ప్రేమకు మించి ఏది లేదు.. ఇంటర్నెట్‌లో చూసే ప్రతీది నమ్మవద్దు'అనే క్యాప్షన్‌తో హార్దిక్ పాండ్యాను ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశాడు.

ఆ కాసేపటికే హార్దిక్ పాండ్యా సైతం ఈ పోస్ట్‌ను షేర్ చేస్తూ.. 'మన మధ్య ఎప్పటికే ప్రేమ ఉంటుంది శుభు బేబీ'అని క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్‌లు వైరల్‌గా మారాయి. ఇద్దరి మధ్య గొడవలంటూ వచ్చిన వార్తలకు హార్దిక్, శుభ్‌మన్ గిల్ ఫుల్‌స్టాప్ పెట్టారు. రోహిత్ శర్మ వారసుడిగా శుభ్‌మన్ గిల్‌‌కు టీమిండియా టెస్ట్ టీమ్ సారథ్య బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ పర్యటనతో శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించనున్నాడు.

ఐపీఎల్ 2025 సీజన్‌లో అసాధారణ ప్రదర్శన కనబర్చిన గుజరాత్ టైటాన్స్.. కీలక ఎలిమినేటర్‌లో ఓటమిపాలైంది. ఆఖరి వరకు పోరాడినా గుజరాత్‌కు విజయం దక్కలేదు. మరోవైపు హార్దిక్ పాండ్యా సంచలన బ్యాటింగ్‌తో పాటు జస్‌ప్రీత్ బుమ్రా అసాధారణ బౌలింగ్ ప్రదర్శనతోనే ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. క్వాలిఫయర్-2లో పంజాబ్ కింగ్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.

Story first published: Sunday, June 1, 2025, 17:06 [IST]
Other articles published on Jun 1, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+