For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ నలుగురి వల్లే ఈ విజయం: హార్దిక్ పాండ్యా

దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్ అద్భుత ఆరంభాన్ని అందిస్తే.. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ విజయ లాంఛనాన్ని పూర్తి చేశారని ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అన్నాడు. జట్టులోని ఆటగాళ్లంతా క్లిక్ అయితే తమ ఆధిపత్యం కొనసాగుతుందని తనకు ముందే తెలుసని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో బుధవారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.

నిప్పులు చెరిగిన బౌల్ట్..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 143 పరుగులు మాత్రమే చేసింది. హెన్రీచ్ క్లాసెన్(44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 71), అభినవ్ మనోహర్(37 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 43) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ట్రావిస్ హెడ్(0), అభిషేక్ శర్మ(8), ఇషాన్ కిషన్(1), నితీష్ కుమార్ రెడ్డి(2), ప్యాట్ కమిన్స్(1) దారుణంగా విఫలమయ్యారు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్(4/26) నాలుగు వికెట్లు తీయగా.. దీపక్ చాహర్(2/12) రెండు వికెట్లు పడగొట్టాడు. బుమ్రా, హార్దిక్ పాండ్యా చెరో వికెట్ తీసారు.

IPL 2025 Hardik Pandya says Deepak Boult set it up Rohit SKY finished it After MI beat SRH
Photo Credit: screen grab for JioHotstar

రోహిత్ విధ్వంసం..
అనంతరం ముంబై 15.4 ఓవర్లలోనే 3 వికెట్లకు 146 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. రోహిత్ శర్మ(46 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 70) హాఫ్ సెంచరీతో రాణించగా.. సూర్యకుమార్ యాదవ్(19 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సన్‌రైజర్స్ బౌలర్లలో ఉనాద్కత్, మలింగా, జీషన్ అన్సారీ చెరో వికెట్ తీసారు.

నాకు ముందే తెలుసు..
ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన హార్దిక్ పాండ్యా సంతోషం వ్యక్తం చేశాడు. 'ఈ విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. సరైన సమయంలో మా కుర్రాళ్లు మూమెంటమ్ అందుకున్నందుకు ఆనందంగా ఉంది. జట్టులోని ప్రతీ ఒక్కరు క్లిక్ అయితే మా జట్టు ఆధిపత్యం కొనసాగుతుందని నాకు ముందే తెలుసు. దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్ అద్భుత బౌలింగ్‌తో మంచి ఆరంభం అందిస్తే.. రోహిత్ శర్మ, సూర్య సూపర్ బ్యాటింగ్‌తో విజయలాంఛనాన్ని పూర్తి చేశారు.

ఓవరాల్‌గా ఇదో అద్భుతమైన విజయం. పరిస్థితుల నేపథ్యంలోనే దీపక్ చాహర్‌తో వరుసగా నాలుగు ఓవర్లు బౌలింగ్ చేయించాను. ముందస్తు ప్రణాళికలే కాకుండా పరిస్థితులకు తగ్గట్లు వ్యూహాలు రచించాలని కెప్టెన్‌గా తెలుసుకున్నా. పవర్ ప్లేలో దీపక్ అద్భుతంగా బౌలింగ్ చేసినప్పుడు.. అతని ఆఖరి ఓవర్‌ను చివరి వరకు ఎందుకు ఆపాలి? ప్రతీ విభాగంలో మరింత మెరుగవ్వాలి. ఏది ఏమైనా మా ప్రదర్శన సంతృప్తినిచ్చింది.'అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.

Story first published: Thursday, April 24, 2025, 7:52 [IST]
Other articles published on Apr 24, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+