Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: ఆ విషయంలో కేకేఆర్ తప్పు చేసింది: హర్భజన్ సింగ్

ఐపీఎల్ 2025 సీజన్ నేపథ్యంలో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) వెటరన్ బ్యాటర్ అజింక్యా రహానేను కెప్టెన్‌గా నియమించింది. అయితే ఈ నిర్ణయాన్ని మాజీ క్రికెటర్లు ఆకాశ్ చోప్రా, హర్భజన్ సింగ్ తప్పుబట్టారు. అజింక్యా రహానే‌కు బదులు మరో వ్యక్తిని కెప్టెన్‌గా నియమించాల్సిందని అభిప్రాయపడ్డారు.

ఐపీఎల్ 2024 సీజన్‌లో కేకేఆర్‌ను విజేతగా నిలబెట్టిన శ్రేయస్ అయ్యర్.. జట్టును వీడి పంజాబ్ కింగ్స్‌కు వెళ్లాడు. దాంతో కేకేఆర్ కొత్త కెప్టెన్‌ను ఎంచుకోవాల్సి వచ్చింది. అనుభవానికి ప్రాధాన్యత ఇస్తూ రహానేను కెప్టెన్‌గా నియమించిన కేకేఆర్.. వెంకటేశ్ అయ్యర్‌కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది.

IPL 2025 Harbhajan Singh warns KKR captain Ajinkya Rahane could ruin team s campaign

తాజా కేకేఆర్ జట్టు గురించి మాట్లాడిన హర్భజన్ సింగ్.. అజింక్యా రహానే కారణంగా బ్యాటింగ్ ఆర్డర్ బలహీనంగా మారుతుందన్నాడు. అతన్ని కెప్టెన్సీ కోసం ఎంపిక చేసి ఉంటే.. రహానేకు బదులు వేరే పేరు ప్రకటించి ఉండాల్సిందన్నాడు. 'అజింక్యా రహానే బ్యాటర్ ఆర్డర్‌పై కాస్త గందరగోళం నెలకొంది. కేకేఆర్‌లో వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్ రూపంలో డేంజరస్ బ్యాటర్లు ఉన్నారు. కాబట్టి రహానే మిడిలార్డర్‌లో ఆడలేడు.

కాబట్టి అతను నెంబర్ 3లో బ్యాటింగ్‌కు రావడం ఉత్తమం. ఎందుకంటే ఓపెనింగ్ జోడీ ఖరారైంది. రహానేను కేవలం సారథ్య బాధ్యతల కోసమే ఎంపిక చేసి ఉంటే.. అందుకోసం సునీల్ నరైన్, వెంకటేశ్ అయ్యర్, ఆండ్రీ రస్సెల్‌లో ఒకరిని ఎంపిక చేయాల్సింది. కేకేఆర్ ఆరంభంలోనే వికెట్లు కోల్పోతోనే రహానేకు బ్యాటింగ్ చేసే అవకాశం దక్కుతుంది. ఎందుకంటే 12, 13 ఓవర్ల తర్వాత రహానే పవర్ హిట్టర్‌లా బ్యాటింగ్ చేయలేడు.'అని హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు.

కేకేఆర్ కోచ్ చంద్రకాంత్ పండిట్, మెంటార్ డ్వేన్ బ్రావో‌లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఇద్దరూ పూర్తిగా భిన్నమైన వ్యక్తులని, ఎలా పనిచేస్తారో చూడాలన్నాడు. 'డ్వేన్ బ్రావో, చంద్రకాంత్ పండిట్ విభిన్నమైన వ్యక్తులు. ఒకరు ఉదయం 5 గంటలకు నిద్రలేస్తే.. మరొకరు ఉదయం 6 గంటలకు పడుకుంటారు. వారు ఎలా కలిసి పని చేస్తారో చూడాలి.'అని హర్భజన్ సింగ్ తెలిపాడు.

Story first published: Monday, March 17, 2025, 18:01 [IST]
Other articles published on Mar 17, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+