For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

RR Retention List: జోస్ బట్లర్‌‌పై వేటు.. రాజస్థాన్ రాయల్స్ రిటెన్షన్ జాబితా ఇదే!

క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన రిటెన్షన్ జాబితాలు విడుదలయ్యాయి. రిటెన్షన్ జాబితాల సమర్పణకు గురువారంతో గడువు ముగియడంతో ఐపీఎల్ అధికారిక బ్రాడ్‌కాస్టర్స్ స్టార్ స్పోర్ట్స్, జియోసినిమాలు 10 జట్ల రిటెన్షన్ జాబితాలను ప్రకటించాయి. ఒక్కో జట్టు అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు, విడుదల చేసిన ప్లేయర్ల వివరాలను వెల్లడించాయి.

రాజస్థాన్ రాయల్స్ తమ కోర్ ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. మొత్తం ఆరుగురి ఆటగాళ్లను అట్టిపెట్టుకుంది. కెప్టెన్ సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్‌లను రూ. 18 కోట్లకు రిటైన్ చేసుకున్న రాజస్థాన్ రాయల్స్.. రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్‌లను రూ. 14 కోట్లకు అట్టిపెట్టుకుంది. విధ్వంసకర ఆల్‌రౌండర్ షిమ్రాన్ హెట్‌మైర్‌ను రూ. 11 కోట్లకు, అనామక ప్లేయర్‌గా సందీప్ శర్మను రూ. 4 కోట్లకు రిటైన్ చేసుకుంది.

IPL 2025 Full list of Rajasthan Royals retained and released players

ఈ ఆరుగురి రిటెన్షన్ కోసం రూ. 79 కోట్లు ఖర్చు చేసింది. ఇంకా ఆ జట్టు పర్స్‌లో రూ. 41 కోట్లు ఉన్నాయి. ఈ డబ్బులతోనే ఆ జట్టు మరో 16-17 మంది ఆటగాళ్లను తీసుకోవాలి. ఆరుగురిని రిటైన్ చేసుకోవడంతో రాజస్థాన్ రాయల్స్ వద్ద ఒక్క ఆర్‌టీఎమ్ కార్డ్ కూడా లేకుండా పోయింది. స్టార్ ఓపెనర్, ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్‌ను వదిలేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.

రాజస్థాన్ రాయల్స్

సంజూ శాంసన్-రూ. 18 కోట్లు

యశస్వి జైస్వాల్-రూ. 18 కోట్లు

రియాన్ పరాగ్-రూ. 14 కోట్లు

ధ్రువ్ జురెల్-రూ. 14 కోట్లు

షిమ్రాన్ హెట్‌మైర్-రూ. 11 కోట్లు

సందీప్ శర్మ-రూ. 4 కోట్లు

రిటెన్షన్ కోసం ఖర్చు చేసిన డబ్బులు: రూ. 79 కోట్లు

పర్స్‌లో మిగిలిన డబ్బులు: రూ. 41 కోట్లు

రాజస్థాన్ రాయల్స్ రిలీజ్ లిస్ట్:
జోస్ బట్లర్, డోనోవన్ ఫెర్రెరియా, కునల్ రాథోర్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ సేన్, నవ్‌దీప్ సైనీ, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, ఆవేశ్ ఖాన్, రోవ్‌మన్ పోవెల్, శుభ్‌మ్ దుబే, టామ్ కోహ్లేర్-కాడ్‌మోర్, అబిడ్ ముష్తక్, నండ్రే బర్గర్, తనూష్ కోటియన్, కేశవ్ మహరాజ్, ప్రసిధ్ కృష్ణ, ఆడమ్ జంపా.

Story first published: Thursday, October 31, 2024, 20:40 [IST]
Other articles published on Oct 31, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+