Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RR vs MI: ర్యాన్ రికెల్టన్ అత్యుత్సాహం.. రోహిత్ శర్మ ఆగ్రహం!

ముంబై ఇండియన్స్ ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ అత్యుత్సాహం ప్రదర్శించాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఔటవ్వకుండానే ఔటైనట్లు భావించి పెవిలియన్ వైపు నడిచాడు. సహచర ఓపెనర్, ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ మందలించడంతో వెనుదిరిగాడు. ర్యాన్‌ రికెల్టన్ అత్యుత్సాహంతో బౌలర్.. రివ్యూ తీసుకోగా నాటౌట్‌గా తేలింది. రోహిత్ శర్మ అప్రమత్తంగా ఉండటంతో ముంబై ఇండియన్స్‌కు భారీ నష్టం తప్పింది. అంపైర్ కూడా ఎలాంటి అయోమయానికి గురవ్వలేదు.

మహీష్ తీక్షణ వేసిన 6వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్‌ ఐదో బంతిని రికెల్టన్ బ్యాక్ ఫుట్‌లో బీట్ అయ్యాడు. బ్యాక్ ఫుట్ ఫ్లిక్ ఆడే క్రమంలో బంతిని అంచనా వేయడంలో విఫలమయ్యాడు. దాంతో బంతి ప్యాడ్లను తాకింది. తీక్షణ గట్టిగా అప్పీల్ చేయగా.. రికెల్టన్ పెవిలియన్ వైపు నడిచాడు. అంపైర్ నాటౌట్ ఇవ్వడం.. రోహిత్ మందలించడంతో రికెల్టన్ ఆగిపోయాడు. రిప్లేలో బంతి ఔట్ సైడ్ లెగ్‌లో పిచ్ అయినట్లు స్పష్టమైంది.

IPL 2025 Fans Criticizes Ryan Rickelton s Brain Fade Moment During RR vs MI Match

సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఇలానే అత్యుత్సాహం ప్రదర్శించి ఔటవ్వకుండానే పెవిలియన్ చేరాడు. దాంతో అతనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. తాజాగా ర్యాన్ రికెల్టన్ కూడా అలానే చేయబోవడంతో ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఫెయిర్ ప్లే అవార్డ్ కోసం ఇలా చేస్తున్నారా? అని విమర్శలు గుప్పిస్తున్నారు.

Story first published: Thursday, May 1, 2025, 20:24 [IST]
Other articles published on May 1, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+