Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: వాడు గనుక ‌SRH జట్టులో ఉంటేరా చారి..!

ఐపీఎల్ 2025 మెగా వేలంలో గుజరాత్ టైటాన్స్ లెఫ్టార్మ్ స్పిన్నర్ రవి శ్రీనివాసన్ సాయి కిషోర్ కోసం తాము తీవ్రంగా ప్రయత్నించామని సన్‌రైజర్స్ హైదరాబాద్ హెడ్ కోచ్ డానియల్ వెటోరీ వెల్లడించాడు. అతని కోసం ఆఖరి వరకు ప్రయత్నించామని, తృటిలో అతను చేజారడని చెప్పాడు. సాయి కిషోర్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి వచ్చి ఉంటే తమ జట్టు పరిస్థితి మరోలా ఉండేదన్నాడు.

అతన్ని తీసుకొని ఉంటే..
ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో విజయానంతరం మీడియాతో మాట్లాడుతూ వెటోరి ఈ వ్యాఖ్యలు చేశాడు. 'ఈ సీజన్‌లో సాయి కిశోర్ అద్భుతంగా రాణిస్తున్నాడు. మెగా వేలంలో అతన్ని కొనుగోలు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించాం. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఓ మంచి బౌలర్‌కు ఉండాల్సిన లక్షణాలన్నీ అతనిలో ఉన్నాయి. అతని బౌలింగ్ ఇతర స్పిన్నర్లకు ఓ టెంప్లెట్. బ్యాటింగ్‌ పిచ్‌లపై కూడా అతను అసాధారణ ప్రదర్శన చేస్తాడు. అందుకే అతన్ని సన్‌రైజర్స్ జట్టులోకి తీసుకోవాలనుకున్నాం.'అని డానియల్ వెటోరి చెప్పుకొచ్చాడు.

IPL 2025 Fans Believe Sai Kishore Could Transform SRH s Fortunes

రూ.2 కోట్లకే..
సాయి కిషోర్‌ను రైట్ టూ మ్యాచ్ కార్డ్ కింద గుజరాత్ టైటాన్స్ రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది. సాయి కిషోర్ కోసం ఆరంభంలో బిడ్ వేసిన సన్‌రైజర్స్.. పంజాబ్ కింగ్స్ ఎంట్రీ కావడంతో పక్కకు తప్పుకుంది. చివరకు గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది. ఈ సీజన్‌లో సాయి కిషోర్ అసాధారణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడి 8.22 ఎకానమీతో 12 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్‌లో ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సాయి కిషోర్(2/24) తన బౌలింగ్‌తో హైదరాబాద్ పతనాన్ని శాసించాడు. నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్‌లను పెవిలియన్ చేర్చాడు.

SRH జట్టులో ఉంటేరా చారి..
ఈ క్రమంలోనే సాయి కిషోర్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఉంటే టీమ్ పరిస్థితి మరోలా ఉండేదని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. బౌలింగ్ విభాగం పటిష్టంగా మారేదని, ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో సాయి కిషోర్ కట్టడిగా బౌలింగ్ చేసేవాడని అభిప్రాయపడుతున్నారు. 'సాయి కిషోర్ గనుక ‌SRH జట్టులో ఉంటేరా చారి..!'అని మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. ప్రస్తుతం సన్‌రైజర్స్ 9 మ్యాచ్‌ల్లో మూడు మాత్రమే గెలిచి ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. చివరి ఐదు మ్యాచ్‌లకు ఐదు గెలిస్తే ప్లే ఆఫ్స్ చేరుతుంది. ఒక్కటి ఓడినా ఇంటిదారి పడుతోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ తదుపరి మ్యాచ్‌ను శుక్రవారం అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో ఆడనుంది.

Story first published: Sunday, April 27, 2025, 11:45 [IST]
Other articles published on Apr 27, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+