Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH ఓటమి.. ఆటగాళ్లపైకి బాటిల్స్ విసిరేసిన ఫ్యాన్స్?

ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ముంబై ఇండియన్స్‌తో ఉప్పల్ వేదికగా బుధవారం ఏక పక్షంగా సాగిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన సన్‌రైజర్స్ హైదరాబాద్ 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. మరోసారి టాపార్డ్ వైఫల్యంతో ఆరెంజ్ ఆర్మీ మూల్యం చెల్లించుకుంది. అయితే ఈ ఓటమిపై సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు.. తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. మ్యాచ్ అనంతరం సన్‌రైజర్స్ ఆటగాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ మ్యాచ్‌కు రామని, సన్‌రైజర్స్‌ జట్టును అభిమానించమని భావోద్వేగానికి గురయ్యారు.

ఆటగాళ్లపైకి బాటిల్స్..?
ఈ క్రమంలోనే ఓ ఫేక్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ముంబై చేతిలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమిని తట్టుకోలేని ఫ్యాన్స్‌.. ఆటగాళ్లపై వాటర్ బాటిల్స్ విసిరేసి నిరసన వ్యక్తం చేశారని ఓ ఫేక్ వీడియోను ఓ నెటిజన్ ఎక్స్‌ వేదికగా పంచుకున్నాడు. EpicCommentsTelugu అనే యూజర్.. ఈ ఫేక్ వీడియోను షేర్ చేయగా.. నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సదరు యూజర్ ఆర్‌సీబీ ఫ్యాన్స్‌ను కొనియాడుతూ మరి ఈ వీడియోను పంచుకున్నాడు.

IPL 2025 Fact Check The Truth Behind Viral Video of Fans Throwing Bottles at SRH Players

గ్రోక్ చెప్పిన.. నిజమిదే..!
అయితే ఇది ఫేక్ వీడియో అని, మిస్ లీడింగ్ కంటెంట్ అని ఎక్స్‌ ఏఐ టూల్ గ్రోక్ స్పష్టం చేసింది. ఈ ఘటన బుధవారం జరిగిన మ్యాచ్‌లో జరగలేదని, మైదానంలోకి బాటిల్స్ విసిరేసారనడానికి స్పష్టమైన ఆధారాలు లేవని గ్రోక్ స్పష్టం చేసింది. స్టేడియం రూల్స్ ప్రకారం వాటర్ బాటిల్స్‌ను అనుమతించరని కూడా గ్రోక్ పేర్కొంది. ఈ ఫేక్ వీడియోను నెటిజన్లు నిజమేనని పొరబడుతున్నారు.

IPL 2025 Fact Check The Truth Behind Viral Video of Fans Throwing Bottles at SRH Players

నిప్పులు చెరిగిన బౌల్ట్..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 143 పరుగులు మాత్రమే చేసింది. హెన్రీచ్ క్లాసెన్(44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 71), అభినవ్ మనోహర్(37 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 43) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ట్రావిస్ హెడ్(0), అభిషేక్ శర్మ(8), ఇషాన్ కిషన్(1), నితీష్ కుమార్ రెడ్డి(2), ప్యాట్ కమిన్స్(1) దారుణంగా విఫలమయ్యారు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్(4/26) నాలుగు వికెట్లు తీయగా.. దీపక్ చాహర్(2/12) రెండు వికెట్లు పడగొట్టాడు. బుమ్రా, హార్దిక్ పాండ్యా చెరో వికెట్ తీసారు.

IPL 2025 Fact Check The Truth Behind Viral Video of Fans Throwing Bottles at SRH Players

రోహిత్ విధ్వంసం..
అనంతరం ముంబై 15.4 ఓవర్లలోనే 3 వికెట్లకు 146 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. రోహిత్ శర్మ(46 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 70) హాఫ్ సెంచరీతో రాణించగా.. సూర్యకుమార్ యాదవ్(19 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సన్‌రైజర్స్ బౌలర్లలో ఉనాద్కత్, మలింగా, జీషన్ అన్సారీ చెరో వికెట్ తీసారు.

Story first published: Thursday, April 24, 2025, 11:53 [IST]
Other articles published on Apr 24, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+