Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

PBKS vs RCB:శ్రేయస్ అయ్యర్‌కు లిప్‌లాక్ ఇచ్చిన ప్రీతీ జింటా!(వీడియో)

పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ఆ టీమ్ సహా ఓనర్, బాలీవుడ్ హీరోయిన ప్రీతీ జింటా‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మైదానంలోనే ఈ ఇద్దరూ లిప్ లాక్‌ ఇచ్చుకున్నట్లు ఉన్న ఈ వీడియో సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఐపీఎల్ 2025 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ వరుస విజయాలు సాధిస్తుండటంతో తమ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు ప్రీతీ జింటా లిప్ లాక్ ఇచ్చినట్లు కొందరు ఆకతాయిలు ఈ వీడియోను నెట్టింట వైరల్‌ చేశారు. కానీ ఇది ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) జనరేటెడ్ వీడియో అని ఫ్యాక్ట్ చెక్ ద్వారా తేలింది.

ఏఐ టెక్నాలిజీని ఉపయోగించి ఈ వీడియోను రూపొందించినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఈ విషయాన్ని గ్రహించని నెటిజన్లు నిజమేనని పొరబడుతున్నారు. మరోవైపు ఈ వీడియోపై పంజాబ్ కింగ్స్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఫేక్ వీడియోలను క్రియేట్ చేసేవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఏఐ టెక్నాలజీ సెలెబ్రిటీలకు శాపంగా మారింది. మంచికి వాడాల్సిన సాంకేతికను కొందరు ఆకతాయిలు తప్పుడు పనులకు ఉపయోగిస్తున్నారు. ఏఐ సాయంతో నకిలీ ఫొటోలు, వీడియోలను సృష్టించి పలువురు ప్రముఖుల పరువును బజారున పడేస్తున్నారు.

IPL 2025 Fact Check Heres the truth behind viral video of PBKS owner Preity Zinta and Shreyas Iyer
Photo Credit: twitter (X)

ఐపీఎల్ 2025 సీజన్ నేపథ్యంలో ఈ జాడ్యం మరీ ఎక్కువైంది. టీమ్ ఓనర్స్‌కు ఆటగాళ్లతో ఎఫైర్స్ పెడుతూ.. ఏఐ సాయంతో ఫేక్ వీడియోలను సృష్టించి వైరల్ చేస్తున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్‌పై కూడా ఈ నకిలీ వీడియోలను సృష్టించి ట్రెండ్ చేశారు. కావ్య మారన్-ప్యాట్ కమిన్స్, కావ్య మారన్-ఇషాన్ కిషన్, కావ్య మారన్-అభిషేక్ శర్మలు రోమాన్స్ చేస్తున్నట్లు నకిలీ వీడియోలు, ఫొటోలు రూపొందించారు. ఇవన్నీ నకిలీ వీడియోలని తెలియని కొందరు నిజమేనని పొరబడుతున్నారు. ఏఐ టెక్నాలజీని కంట్రోల్ చేయాలని, ఇలాంటి ఫేక్ ఫొటోలు, వీడియోలకు అడ్డుకట్ట వేయాలని నెటిజన్లు కోరుతున్నారు.

ఐపీఎల్ 2025 సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌ అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. 8 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించిన ఆ జట్టు పాయింట్స్ టేబుల్‌లో టాప్-4లో కొనసాగుతోంది. మరో మూడు విజయాలు సాధిస్తే ఆ జట్టు ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకోనుంది. ఆర్‌సీబీతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. విరాట్ కోహ్లీ(54 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 73 నాటౌట్), దేవదత్ పడిక్కల్ (35 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 61)హాఫ్ సెంచరీలతో ఆర్‌సీబీ.. పంజాబ్‌పై ప్రతీకారం తీర్చుకుంది.

Story first published: Monday, April 21, 2025, 11:44 [IST]
Other articles published on Apr 21, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+