కోహ్లీ రెచ్చగొట్టడంతోనే.. కేఎల్ రాహుల్ వైల్డ్ రియాక్షన్! (వీడియో)
ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించే టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్.. ఒక్కసారిగా తన ఉగ్రరూపాన్ని చూపించాడు. క్లాస్ బ్యాటర్‌గా.. వివాదరహితుడిగా గుర్తింపు పొందిన రాహుల్.. తొలి సారి వైల్డ్ రియాక్షన్‌తో సంబరాలు చేసుకున్నాడు. తన 12 ఏళ్ల ఐపీఎల్ కెరీర్‌లోనూ రాహుల్ ఏనాడు ఇలా ఆగ్రహంగా సంబరాలు చేసుకోలేదు. సౌమ్యుడిగా పేరొందిన రాహుల్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను గెలింపించి ఓ స్టేట్‌మెంట్ పాస్ చేశాడు.
విన్నింగ్ షాట్‌గా సిక్సర్ కొట్టిన వెంటనే.. 'యే బిడ్డా.. ఇది అడ్డా'అని అగ్రహంగా సంబరాలు చేసుకున్నాడు. బూతు పదాలు కూడా వాడాడు. బ్యాట్‌తో సర్కిల్ గీస్తూ మరి చెప్పాడు. 'ఇది నా గ్రౌండ్.. ఎలా ఆడాలో నాకు తెలుసు'అని ఎవరికో బదులిచ్చాడు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటూ.. భావోద్వేగాలను నియంత్రణలో ఉంచుకునే రాహుల్.. ఇలా ఎందుకు రియాక్ట్ అయ్యాడా? అనే సందేహం అభిమానులతో పాటు క్రికెట్ విశ్లేషకులకు కలిగింది.

అయితే ఆర్‌సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కవ్వించడంతోనే రాహుల్ ఇలా రియాక్ట్ అయ్యాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా పంచుకుంటున్నారు. సాధారణంగా విరాట్ కోహ్లీ మైదానంలో దూకుడుగా ఉంటాడనే విషయం తెలిసిందే. వికెట్ తీసినప్పుడు అతని రియాక్షన్ వైల్డ్‌గా ఉంటాయి. గట్టిగా అరుస్తూ.. సంబరాలు చేసుకుంటాడు. ఢిల్లీతో మ్యాచ్‌లో కూడా ఓ వికెట్ అనంతరం కోహ్లీ గట్టిగా అరుస్తూ సంబరాలు చేసుకున్నాడు.
అయితే పక్కనే ఉన్న కేఎల్ రాహుల్‌ను కవ్విస్తూ కోహ్లీ సెలెబ్రేట్ చేసుకున్నాడు. ఇది మనసులో పెట్టుకున్న రాహుల్.. మ్యాచ్ గెలిపించి.. 'ఇది నా అడ్డా.. ఇక్కడ నాకు ఎలా ఆడాలో తెలుసు'అని బదులిచ్చాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. 'కోహ్లీ.. నువ్వు ఆర్‌సీబీకి ప్రాతినిథ్యం వహించినా.. నేను లోకల్ భాయ్. చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి ఇక్కడ ఆడుతున్నాను. ఇది నా అడ్డా'అని గుర్తు చేశాడని సెటైర్లు పేల్చుతున్నారు. మరికొంత మంది మాత్రం ఐపీఎల్ 2025 మెగా వేలంలో తనను ఆర్‌సీబీ కొనుగోలు చేయలేదనే కసితోనే ఈ సంబరాలు చేసుకున్నాడని అభిప్రాయపడుతున్నారు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 163 పరుగులు చేసింది. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 17.5 ఓవర్లలోనే 4 వికెట్లకు 169 పరుగులు చేసి గెలుపొందింది.
Kohli is seen celebrating the wicket, glancing at KL Rahul.
— Radha (@Radha4565) April 11, 2025
After the win Rahul stared at Kohli and said "This Is My Home Ground" 🔥
Look at Kohli's Reaction 😭😭 pic.twitter.com/uJmO74Jck5
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications