Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: సీఎస్‌కేకు వెన్నుపోటు.. కట్టప్ప అంటూ తమ్ముడిపైనే సెటైర్లు!

ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ దీపక్ చాహర్‌పై అతని సోదరి మాలతి చాహర్ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. తన సోదరుడు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కట్టప్పలా వెన్ను పోటు పొడిచాడని సోషల్ మీడియా వేదికగా పేర్కొంది. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో దీపక్ చాహర్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. అటు బ్యాట్‌తో.. ఇటు బంతితో సత్తా చాటాడు. ముఖ్యంగా 9వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 28 పరుగులతో అజేయంగా నిలిచి ముంబై ఇండియన్స్‌కు 155 పరుగుల పోరాడే లక్ష్యాన్ని అందించాడు.

అనంతరం బౌలింగ్‌లో ఓ వికెట్ తీసాడు. అయితే గత సీజన్ వరకు దీపక్ చాహర్ చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో అతన్ని ముంబై ఇండియన్స్ రూ. 9.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. వేలంలో దీపక్ చాహర్ కోసం పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్‌తో ముంబై ఇండియన్స్ తీవ్రంగా పోటీ పడింది.

IPL 2025 Deepak Chahar s sister s Kattappa post fuelled social media storm

దీపక్ చాహర్ కోసం సీఎస్‌కే కూడా గట్టిగా ప్రయత్నించింది. కానీ ముంబై భారీ ధర పెట్టడంతో వెనకడుగు వేసింది. తొలి మ్యాచ్‌లోనే దీపక్ చాహర్ ఆ డబ్బులకు న్యాయం చేశాడు. దీపక్ చాహర్ ప్రదర్శనను ఉద్దేశించి మాలతి చాహర్‌.. ఇన్‌స్టా వేదికగా బాహుబలి సీన్‌లోని కట్టప్ప వెన్ను పోటు పొడిచే సన్నివేశాన్ని షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. చాహర్ వెన్ను పొటు పొడిచాడనే ఉద్దేశంతో ధోనీ కూడా మ్యాచ్ అనంతరం అతన్ని బ్యాట్‌తో బాదాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 155 పరుగులే చేసింది. సూర్యకుమార్ యాదవ్(26 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 29), తిలక్ వర్మ(25 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 31)టాప్ స్కోరర్లుగా నిలిచారు. చివర్లో దీపక్ చాహర్(15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 28 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. అనంతరం సీఎస్‌కే 19.1 ఓవర్లలో 6 వికెట్లకు 158 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది.

Story first published: Monday, March 24, 2025, 18:47 [IST]
Other articles published on Mar 24, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+