For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2025: ఒక్కో బంతికి రూ. 60 లక్షలు!

ఐపీఎల్ 2025 సీజన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ విజయంతో ముగించింది. పంజాబ్ కింగ్స్‌తో శనివారం జరిగిన ఉత్కంఠ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొత్తం 14 మ్యాచ్‌ల్లో 7 విజయాలు ఓ మ్యాచ్ రద్దుతో 15 పాయింట్స్‌తో ఐదో స్థానంలో నిలిచింది. తృటిలో ప్లే ఆఫ్స్ చేరే అవకాశాన్ని ఢిల్లీ చేజార్చుకుంది. టోర్నీ ఆరంభంలో వరుస విజయాలు అందుకొని టేబుల్ టాపర్‌గా నిలిచిన ఢిల్లీ.. ఆ తర్వాత వరుసగా 4 మ్యాచ్‌లు ఓడి ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది.

ప్లే ఆఫ్స్ చేరకపోయినా ఈ సీజన్‌‌లో ఢిల్లీ మెరుగైన ప్రదర్శన చేసింది. అయితే ఈ సీజన్‌కు స్టార్ ఆటగాళ్లను కోట్లు పెట్టిన కొనుగోలు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ వారిని సరిగ్గా వాడుకోలేకపోయింది. ముఖ్యంగా యార్కర్ల స్పెషలిస్ట్ టీ నటరాజన్‌ను రూ. 10.75 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌.. అతన్ని రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే ఆడించింది. ఈ రెండు మ్యాచ్‌ల్లో నటరాజన్ 3 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. 18 బంతులేసి రూ.10.75 కోట్లను అందుకున్నాడు. ఒక్కో బంతికి రూ. 60 లక్షలు తీసుకున్నాడు. నటరాజన్ బౌలింగ్ చాలా కాస్ట్‌లీ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

IPL 2025 DC Pacer T Natarajan recieves Rs 60 Lhaks for each ball

పంజాబ్‌తో జరిగిన ఆఖరి మ్యాచ్‌లోనూ నటరాజన్‌కు అవకాశం దక్కలేదు. నటరాజన్‌కు బదులు ముఖేష్ కుమార్‌కు ఢిల్లీ అవకాశాలు ఇచ్చింది. అతను మాత్రం తీవ్రంగా నిరాశపరిచాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 206 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్(34 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53) హాఫ్ సెంచరీతో రాణించగా.. మార్కస్ స్టోయినీస్(16 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 44 నాటౌట్), జోష్ ఇంగ్లీస్(12 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32) దూకుడుగా ఆడారు.

ఢిల్లీ బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహ్మాన్(3/33) మూడు వికెట్లు తీయగా.. విప్రజ్ నిగమ్(2/38), కుల్దీప్ యాదవ్(2/39) రెండేసి వికెట్లు పడగొట్టారు. ముఖేష్ కుమార్‌కు ఓ వికెట్ దక్కింది. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 19.3 ఓవర్లలోనే 4 వికెట్లకు 204 పరుగులు చేసింది. సమీర్ రిజ్వీ(25 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 58 నాటౌట్), కరుణ్ నాయర్(27 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 44) రాణించారు. పంజాబ్ బౌలర్లలో హర్‌ప్రీత్ బ్రార్(2/41) రెండు వికెట్లు తీయగా.. మార్కో జాన్సెన్, ప్రవీన్ దూబే చెరో వికెట్ పడగొట్టారు.

Story first published: Sunday, May 25, 2025, 9:11 [IST]
Other articles published on May 25, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+