Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CSK vs SRH: హర్షల్ పటేల్ కాదు.. అతనే మ్యాచ్ విన్నర్!

ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మూడో విజయాన్ని నమోదు చేసింది. ప్లే ఆఫ్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించి అద్భుత విజయాన్నందుకుంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో శుక్రవారం చెపాక్ మైదానం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆరెంజ్ ఆర్మీ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. 12 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత చెన్నై గడ్డపై ఆరెంజ్ ఆర్మీ విజయం సాధించింది.

సమష్టి ప్రదర్శనతో..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 19.4 ఓవర్లలో 154 పరుగులకే ఆలౌటైంది. డెవాల్డ్ బ్రెవిస్(25 బంతుల్లో ఫోర్, 4 సిక్స్‌లతో 42), ఆయుష్ మాత్రే(19 బంతుల్లో 6 ఫోర్లతో 30) టాప్ స్కోరర్లుగా నిలిచారు. సన్‌రైజర్స్ బౌలర్లలో హర్షల్ పటేల్(4/28) నాలుగు వికెట్లతో సీఎస్‌కే పతనాన్ని శాసించాడు. ప్యాట్ కమిన్స్, జయదేవ్ ఉనాద్కత్ రెండేసి వికెట్లు తీయగా.. మహమ్మద్ షమీ, కామిందు మెండీస్ తలో వికెట్ తీసారు.

అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ 18.4 ఓవర్లలో 5 వికెట్లకు 155 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్(34 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 44), కామిందు మెండీస్(22 బంతుల్లో 3 ఫోర్లతో 32 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలిచారు. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్(2/42) రెండు వికెట్లు తీయగా.. ఖలీల్ అహ్మద్, అన్షుల్ కంబోజ్, రవీంద్ర జడేజా తలో వికెట్ పడగొట్టారు.

IPL 2025 CSK vs SRH What was the Turning Point as Sunrisers Hyderabad beat Chennai Super Kings

మ్యాచ్ విన్నర్ ఎవరంటే..
నాలుగు వికెట్లతో సీఎస్‌కే పతనాన్ని శాసించిన హర్షల్ పటేల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది. అయితే ఈ నిర్ణయాన్ని ఫ్యాన్స్ తప్పుబడుతున్నారు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన కామిందు మెండీస్‌కు ఈ అవార్డ్ ఇవ్వాల్సిందని అభిప్రాయపడుతున్నారు. కామిందు మెండీస్ ఓ స్టన్నింగ్ క్యాచ్‌ అందుకోవడంతో పాటు కీలక బ్యాటర్ అయిన జడేజా వికెట్ తీసాడు. బ్యాటింగ్‌లో 32 పరుగులతో అజేయంగా నిలిచిన మెండీస్.. నితీష్ రెడ్డితో కలిసి 49 పరుగుల అజేయ భాగస్వామ్యంతో జట్టు విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. ఈ క్రమంలోనే త్రీడీ పెర్ఫామెన్స్ కనబర్చిన మెండీస్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ ఇవ్వాల్సిందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

మ్యాచ్ టర్నింగ్ పాయింట్..
ఈ మ్యాచ్‌లో కామిందు మెండీస్ అందుకున్న క్యాచ్‌ ఈ మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలవడంతో పాటు ఈ సీజన్‌లోనే హైలైట్‌గా నిలిచింది. విధ్వంసకర బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్ ఇచ్చిన క్యాచ్‌ను బౌండరీ లైన్ వద్ద కళ్లు చెదిరే డైవ్‌తో మెండీస్ అందుకున్నాడు. ఈ క్యాచ్ అందుకోకపోయి ఉంటే బ్రెవిస్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగేవాడు. అప్పుడు మ్యాచ్ ఫలితం మరోలా ఉండేది. ఈ సీజన్‌లోని అత్యుత్తమ క్యాచ్‌ల్లో కామిందు క్యాచ్‌ టాప్‌లో నిలుస్తోంది.

Story first published: Saturday, April 26, 2025, 9:42 [IST]
Other articles published on Apr 26, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+