Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సీరియల్ నటితో సీఎస్‌కే స్టార్ ప్లేయర్ డేటింగ్!

చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) స్టార్ పేసర్ మతీష పతిరణ ఓ తమిళ సీరియల్ నటితో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఐపీఎల్ 2025 సీజన్ ముందు ఈ రూమర్స్.. తమిళ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారాయి. మార్చి 22న ఐపీఎల్ 2025 సీజన్‌కు తెరలేవనుండగా.. పది ఫ్రాంచైజీలు ఇప్పటికే తమ ప్రాక్టీస్ క్యాంప్‌లను ప్రారంభించాయి.

అందరి కంటే ముందే ప్రాక్టీస్ క్యాంప్ ప్రారంభించిన సీఎస్‌కే చెన్నైలోని చెపాక్ మైదానం వేదికగా ముమ్మరంగా సాధన చేస్తోంది. మార్చి 23న ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌తో సీఎస్‌కే తమ టైటిల్ వేటను ప్రారంభించనుంది. అయితే శ్రీలంకకు చెందిన మతీష పతీరణ.. సీఎస్‌కేకు ప్రధాన పేసర్. దిగ్గజ లంక బౌలర్ లసిత్ మలింగా శైలిని పోలీ ఉండే మతీష పతీరణ ఇప్పటికే తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు.

IPL 2025 CSK Pacer Matheesha Pathirana Dating With Baakiyalakshmi Serial Actress Neha Menon Reports

వరల్డ్ క్లాస్ పేసర్‌గా..
మహేంద్ర సింగ్ ధోనీ పర్యవేక్షణలో అతను వరల్డ్ క్లాస్ బౌలర్‌గా ఎదిగాడు. ఒత్తిడిలో కట్టడిగా బౌలింగ్ చేయడంతో పాటు.. ప్రత్యర్థి బ్యాటర్లను తన బౌలింగ్‌తో ముప్పుతిప్పలు పెడుతున్నాడు. ఈ క్రమంలోనే అతనికి తమిళనాడులో ఫుల్ క్రేజ్ వచ్చింది. అతన్ని అభిమానించే వారు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా అతనికి లేడీ ఫ్యాన్స్ ఉండటం విశేషం.

అయితే తమిళ పాపులర్ సీరియల్ భాగ్యలక్ష్మి నటి నేహా మీనన్‌తో పతీరణ ప్రేమాయణం నడిపిస్తున్నట్లు గత కొంతకాలంగా తమిళ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇటీవల నేహా డ్యాన్స్ వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వీడియోను నెటిజన్లు బాగా ట్రోల్ చేశారు. ఈ సమయంలోనే పతిరణతో నెహా మీనన్ డేటింగ్ చేస్తుందని, ఈ ఇద్దరూ తరుచూ కలుసుకుంటున్నారని కొందరు అభిమానులు కామెంట్ చేశారు. దాంతో వీరి ప్రేమాయణం వార్తలు మరోసారి వార్తల్లో నిలిచాయి.

ఆ వార్తల్లో నిజం లేదు..
అయితే ఈ వార్తలను నేహా మీనన్ ఖండించింది. తాను ఎవరితోనూ డేటింగ్ చేయడం లేదని స్పష్టం చేసింది. తన వ్యక్తిగత జీవితం గురించి తప్పుడు వార్తలు రాయవద్దని పేర్కొంది. తాను ఏ క్రికెటర్, హీరోతో రిలేషన్‌లో లేనని స్పష్టం చేసింది. అయినా అభిమానులు నమ్మడం లేదు. పతీరణతో డేటింగ్ చేస్తుందని, ఐపీఎల్ 2025 సీజన్‌లో పతీరణ కోసం నేహా చెపాక్ స్టేడియానికి వస్తుందని కామెంట్ చేస్తున్నారు.

ఇప్పటి వరకు 20 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడిన మతీష పతీరణ 34 వికెట్లు పడగొట్టాడు. 2023 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ సీజన్‌లో 12 మ్యాచ్‌లు ఆడిన మతీష పతీరణ 19 వికెట్లు పడగొట్టాడు. గత సీజన్‌లో 6 మ్యాచ్‌లే ఆడిన పతీరణ.. గాయంతో టోర్నీ మధ్యలోనే తప్పుకున్నాడు. అతని గైర్హాజరీ చెన్నై విజయవకాశాలను దెబ్బతీసింది. జట్టులో కీలక ఆటగాడిగా మారిన పతీరణను ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ రూ. 13 కోట్ల భారీ ధరకు రిటైన్ చేసుకుంది.

Story first published: Monday, March 17, 2025, 17:13 [IST]
Other articles published on Mar 17, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+