IPL 2025: సీఎస్‌కేలోకి రవిచంద్రన్ అశ్విన్!
టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. ఐపీఎల్‌లో సొంత గూటికి చేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. అతన్ని జట్టులోకి తీసుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ ఆసక్తిగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ 2025 మెగా వేలం నేపథ్యంలో పది ఫ్రాంచైజీలు గురువారం తమ రిటెన్షన్ జాబితాలను ప్రకటించిన విషయం తెలిసిందే.
గత సీజన్ వరకు రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన అశ్విన్‌ను ఆ జట్టు వేలంలోకి వదిలేసింది. ఆ జట్టు మొత్తం ఆరుగుర్ని రిటైన్ చేసుకుంది. కెప్టెన్ సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్‌లను రూ. 18 కోట్లకు రిటైన్ చేసుకున్న రాజస్థాన్ రాయల్స్.. రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్‌లను రూ. 14 కోట్లకు అట్టిపెట్టుకుంది. విధ్వంసకర ఆల్‌రౌండర్ షిమ్రాన్ హెట్‌మైర్‌ను రూ. 11 కోట్లకు, అనామక ప్లేయర్‌గా సందీప్ శర్మను రూ. 4 కోట్లకు రిటైన్ చేసుకుంది.

ఆర్‌టీమ్ కార్డు కూడా లేకపోవడంతో అశ్విన్ తిరిగి ఆ జట్టుకు వెళ్లే అవకాశాలు లేవు. ఈ క్రమంలోనే అతన్ని కొనుగోలు చేయాలని సీఎస్‌కే ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ రుతురాజ్ గైక్వాడ్(రూ. 18 కోట్లు), రవీంద్ర జడేజా(రూ. 18 కోట్లు), మతీష పతీరణ(రూ. 13 కోట్లు), శివమ్ దూబే(రూ. 12 కోట్లు), మహేంద్ర సింగ్ ధోనీ(రూ. 4 కోట్లు)లను రిటైన్ చేసుకుంది. ఆ జట్టు వద్ద ఇంకా రూ. 55 కోట్ల పర్స్ మనీ ఉంది. అశ్విన్ రూ. 5 కోట్ల ధరకు సీఎస్‌కేకు దక్కవచ్చు.
అశ్విన్ చెన్నై సూపర్ కింగ్స్‌తోనే తన ఐపీఎల్ కెరీర్‌ను ప్రారంభించాడు. 2009లో ఆ జట్టు తరఫున అరంగేట్రం చేసిన అశ్విన్.. ఆ తర్వాత రైజింగ్ పుణే, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఇప్పటి వరకు 211 మ్యాచ్‌లు ఆడిన అశ్విన్.. ఒక హాఫ్ సెంచరీతో 800 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 180 వికెట్లు తీసాడు.
చెన్నై సూపర్ కింగ్స్ మాజీ బ్యాటర్ డెవాన్ కాన్వేను సీఎస్‌కే ఆర్‌టీఎమ్ కార్డ్ ద్వారా తిరిగి కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఐదుగురిని మాత్రమే రిటైన్ చేసుకున్న సీఎస్‌కే వద్ద ఒక ఆర్‌టీఎమ్ కార్డ్ ఉంది. రిషభ్ పంత్‌ను కూడా కొనుగోలు చేసే ఆలోచనలో చెన్నై సూపర్ కింగ్స్ ఉందని కూడా వార్తలు వచ్చాయి. ధోనీ స్థానాన్ని పంత్‌తో భర్తీ చేయాలనే ఆలోచనతో సీఎస్‌కే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
CHENNAI SUPER KINGS AUCTION UPDATES: [TOI]
— Johns. (@CricCrazyJohns) November 2, 2024
- CSK will eye Ravichandran Ashwin in the auction.
- Devon Conway is one of preferred choices for RTM. pic.twitter.com/cYYuzkRKfp
సీఎస్‌కే మాజీ బ్యాటర్ సురేశ్ రైనా కూడా పంత్ సీఎస్‌కేలోకి వచ్చే అవకాశం ఉందని తెలిపాడు. ఇటీవల ధోనీని కలిసినప్పుడు పంత్ అతనితోనే ఉన్నాడని చెప్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications