IPL 2025: చెన్నై సూపర్ కింగ్స్‌లోకి అశ్విన్, మహమ్మద్ షమీ..!
IPL 2025 మెగా వేలం నేపథ్యంలో ఫ్రాంచైజీలు తమ ప్రణాళికలను సిద్దం చేసుకుంటున్నాయి. ఈ మెగా వేలానికి సంబంధించిన రిటెన్షన్ రూల్స్‌ను బీసీసీఐ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. బుధవారం బెంగళూరు వేదికగా బీసీసీఐ సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. మొత్తం ఐదుగురు ఆటగాళ్ల రిటెన్షన్‌కు అనుమతివ్వాలని, రైట్ టు మ్యాచ్ కార్డ్స్(ఆర్‌టీఎమ్) అవసరం లేదని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఇప్పటి వరకు అయితే ఐపీఎల్ 2025 రిటెన్షన్ పాలసీపై అధికారిక ప్రకటన రాలేదు. మరోవైపు ఫ్రాంచైజీలు మాత్రం మెగా వేలంలో అనుసరించాల్సిన వ్యూహాలను సిద్దం చేసుకుంటున్నాయి. ఇప్పటికే రిటైన్ చేసుకునే ఆటగాళ్లను జాబితాను సిద్దం చేసుకున్న ఐపీఎల్ టీమ్స్.. వేలంలో టార్గెట్ చేయాల్సి ఆటగాళ్ల జాబితాను తయారు చేస్తున్నాయి.

చెన్నై సూపర్ కింగ్స్ సైతం వేలంలో కొనుగోలు చేయాల్సిన ఆటగాళ్ల జాబితాను సిద్దం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ జట్టు రవిచంద్రన్ అశ్విన్‌తో పాటు మహమ్మద్ షమీలపై కన్నేసినట్లు సమాచారం. 2015 వరకు చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన అశ్విన్‌ను మళ్లీ జట్టులోకి తీసుకురావాలనుకుంటోంది.
చెన్నై చెపాక్ మైదానంలో అతనికి మెరుగైన రికార్డ్ ఉండటంతో పాటు బ్యాటింగ్ కూడా మెరుగవ్వడంతో అశ్విన్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అశ్విన్ రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఉన్నాడు. అతన్ని ఆ జట్టు వేలంలోకి వదిలేస్తే కొనుగోలు చేయాలని సీఎస్‌కే భావిస్తోంది. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో కూడా అశ్విన్ అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. బౌలర్‌గా టాపార్డర్ బ్యాటర్‌గా తన జట్టు ఛాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు.
అశ్విన్‌ను తీసుకునే విషయంపై సీఎస్‌కే సీఈవోకాశీ విశ్వనాథ్ స్పందించాడు. అతను చేరితో చెన్నై జట్టు మరింత బలోపేతం అవుతుందని చెప్పాడు.
'అశ్విన్ టీమిండియాతో పాటు తమిళనాడుకు చెందిన గొప్ప క్రికెటర్. అతను జట్టులో చేరితో జట్టు బలోపేతం అవుతోంది. మా అకాడమీకి పెద్ద బూస్ట్ లభిస్తోంది. 'అని చెప్పుకొచ్చాడు. సీఎస్‌కే తరఫున 97 మ్యాచ్‌లు ఆడిన అశ్విన్.. 90 వికెట్లు తీసాడు.
అశ్విన్‌తో పాటు మహమ్మద్ షమీపై కూడా సీఎస్‌కే కన్నేసినట్లు తెలుస్తోంది. 2019లో అతని కోసం సీఎస్‌కే ప్రయత్నించగా.. పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. ఈ సారైనా అతన్ని దక్కించుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. ప్రస్తుతం షమీ.. గుజరాత్ టైటాన్స్‌లో ఉన్నాడు.
CSK is looking for
— रोहित जुगलान Rohit Juglan (@rohitjuglan) September 25, 2024
Ashwin & Shami if they don’t get retentions @RevSportzGlobal
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications