IPL 2025: సీఎస్‌కేను మరో రెండేళ్లు నిషేధించండి!
చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) ఫ్రాంచైజీని మరో రెండేళ్ల పాటు నిషేధించాలని ఆ జట్టు అభిమానులే డిమాండ్ చేస్తున్నారు. ఐపీఎల్ 2025 సీజన్ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ.. టికెట్ల విషయంలో అభిమానులను దారుణంగా మోసం చేసిందని ఆరోపిస్తున్నారు. టికెట్లను అధిక ధరలకు విక్రయించడమే కాకుండా.. సగం టికెట్లను మాత్రమే ఆన్‌లైన్‌లో పెట్టారని మండిపడుతున్నారు.
ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా మార్చి 23(ఆదివారం)న చెపాక్ మైదానం వేదికగా ముంబై ఇండియన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్ల అమ్మకాలు బుధవారమే ప్రారంభమయ్యాయి. చెన్నై చెపాక్ స్టేడియానికి 40 వేల సీటింగ్ కెపాసిటీ ఉండగా.. ఇందులో 35వేలకు పైగా టికెట్లను ఆన్‌లైన్ ద్వారా విక్రయించాలి.

క్షణాల్లో టికెట్లు మాయం..
అయితే ఆన్‌లైన్‌లో రిలీజ్ చేసిన క్షణాల్లోనే టికెట్లన్నీ అయిపోయాయి. టికెట్ల కోసం గంటలకొద్దీ ఆన్‌లైన్ వేదికగా వేచి ఉన్నా.. దొరకలేదని, అసలు టికెట్లు ఆన్‌లైన్ ద్వారా అమ్మడం లేదని సీఎస్‌కే ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. స్టేడియంలోని సగం టికెట్లను తెలిసిన వారికే ఇస్తున్నారని, మరికొన్ని బ్లాక్‌లో అమ్ముతున్నారని ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.
40 వేల టికెట్లు మాత్రమే ఉండగా.. ఈ మ్యాచ్ కోసం రెండు లక్షల యాబై వేల మంది వేచి చూసినట్లు గణంకాలు చెబుతున్నాయి. చెన్నైలో ధోనీకి ఫుల్ క్రేజ్ ఉండటంతో పాటు ముంబై ఇండియన్స్ తరఫున రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ బరిలోకి దిగుతుండటం కూడా టికెట్లను డిమాండ్‌ను అమాంతం పెంచినట్లు తెలుస్తోంది.
10 రెట్లు పెంచి..
చెపాక్ స్టేడియంలో కనీస టికెట్ ధరనే రూ. 1400గా ఉండగా.. బ్లాక్‌లో ఒక్కో టికెట్‌ను 10 రెట్లు పెంచి అమ్ముతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే చెన్నై సూపర్ కింగ్స్‌ను మరో రెండేళ్ల పాటు నిషేధం విధించాలని సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. గతంలో స్పాట్ ఫిక్సింగ్ ఉదంతం నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో పాటు రాజస్థాన్ రాయల్స్‌పై రెండేళ్ల పాటు నిషేధం విధించిన విషయం తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications