Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: కేకేఆర్‌తో మ్యాచ్‌.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు బిగ్ షాక్!

ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌(కేకేఆర్)తో మ్యాచ్‌కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు బిగ్ షాక్ తగిలింది. సన్‌రైజర్స్ యువ హిట్టర్ అనికేత్ వర్మ గాయపడినట్లు తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం గురువారం కోల్‌కతాలోని ఐకానిక్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే బుధవారం ప్రాక్టీస్ సెషన్‌లో అనికేత్ వర్మ బ్యాటింగ్ చేస్తుండగా.. నెట్‌బౌలర్ వేసిన బంతి అతని కాలి బొటన వేలికి బలంగా తాకినట్లు తెలుస్తోంది.

ఈ గాయం ధాటికి నెట్స్‌లోనే అనికేత్ వర్మ కుప్పకూలాడని, నొప్పితో విలవిలలాడాడని కోల్‌కతా రిపోర్టర్లు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. సపోర్ట్ స్టాఫ్ సాయంతో మైదానం వీడిన అనికేత్ వర్మ.. మళ్లీ బ్యాటింగ్‌కు రాలేదని రాసుకొచ్చారు. అయితే అనికేత్ వర్మ గాయం గురించి సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

IPL 2025 Big Blow For SRH As Aniket Verma Injured Ahead Of KKR Clash

ఈ సీజన్‌‌తోనే ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేసిన అనికేత్ వర్మ.. సంచలన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా తన సిక్స్ హిట్టింగ్ సామర్థ్యానికి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఎదుర్కొన్న తొలి బంతినే భారీ సిక్సర్‌గా మలిచిన అనికేత్ వర్మ.. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐదు భారీ సిక్సర్లతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.

ఇక వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో బ్యాటర్లంతా విఫలమైనా వేళ ఒక్కడే హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. 41 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 74 పరుగులు చేసాడు. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ సెన్సేషన్‌గా నిలిచాడు. అలాంటి బ్యాటర్‌‌ దూరమైతే సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కోలుకోలేని దెబ్బ అని చెప్పవచ్చు. ఒకవేళ అనికేత్ వర్మ దూరమైతే.. అతని స్థానంలో సచిన్ బెబీ లేదా అథర్వ టైడ్‌ను ఆడించవచ్చు. కోల్‌కతా పిచ్.. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని, స్పిన్‌కు సహకరిస్తుందని ఆ గ్రౌండ్ క్యూరెటర్ తెలిపాడు.

Story first published: Wednesday, April 2, 2025, 22:53 [IST]
Other articles published on Apr 2, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+