For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2025: ఆర్‌సీబీకి బిగ్ షాక్.. ప్లే ఆఫ్స్‌కు ఆ విధ్వంసకర ఆల్‌రౌండర్ దూరం!

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)అభిమానులకు బ్యాడ్ న్యూస్. ఆ జట్టు విధ్వంసకర బ్యాటర్, వెస్టిండీస్ క్రికెటర్ రొమారియో షెపర్డ్ జట్టుకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కీలకమైన ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌కు ముందే రొమారియో షెపర్డ్ జట్టును వీడుతాడని వార్తలు వస్తున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో షెపర్డ్ విధ్వంసం సృష్టించాడు. 16 నిమిషాలే క్రీజులో ఉన్న ఈ విండీస్ ఆటగాడు 14 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 53 పరుగులతో భీభత్సం సృష్టించాడు.

అతని ధాటికి ఆర్‌సీబీ చివరి 2 ఓవర్లలో 54 పరుగులు చేసింది. రొమారియో షెపర్డ్ విధ్వంసకర బ్యాటింగ్‌, యశ్ దయాల్ సంచలన బౌలింగ్‌తో ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 2 పరుగుల తేడాతో గెలిచి ప్లే ఆఫ్స్ బెర్త్‌‌కు చేరువైంది. మరో విజయం సాధిస్తే ఆ జట్టు టాప్-2 ప్లేస్ కూడా ఖరారు అవుతోంది. ఈ మ్యాచ్‌తో రొమారియో షెపర్డ్ ఎంత కీలకమైన ఆటగాడో అందరికి తెలిసొచ్చింది.

IPL 2025 Big Blow For RCB As Romario Shepherd Likely To Miss playoffs

ఐర్లాండ్‌ పర్యటనకు రొమారియో..
ఆరంభంలో బెంచ్‌కే పరిమితమైన షెపర్డ్.. లియామ్ లివింగ్ స్టోన్ వైఫల్యంతో తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జట్టుకు కీలక ఆటగాడిగా మారాడు. అయితే ఇంగ్లండ్, ఐర్లాండ్‌తో వన్డే సిరీస్‌ల కోసం వెస్టీండీస్ జట్టు ఆ దేశాల్లో పర్యటించనుంది. ఈ రెండు సిరీస్‌లకు రొమారియో షెపర్డ్ ఎంపికయ్యాడు. అతనితో పాటు గుజరాత్ టైటాన్స్ ప్లేయర్ షెర్ఫెన్ రూథర్‌ఫోర్డ్ కూడా ఎంపికయ్యాడు.

మే 21-25 మధ్య ఐర్లాండ్‌తో వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత మే 29 నుంచి జూన్ 3 మధ్య ఇంగ్లండ్‌తో మూడు వన్డే సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌ల కోసం రొమారియో ఆర్‌సీబీ వీడాల్సి ఉంది. రొమారియో షెపెర్డ్ జట్టు వీడటంపై ఆర్‌సీబీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఒకవేళ అతను దూరమైతే మాత్రం టీమ్ కాంబినేషన్ దెబ్బతినననుంది. మే20, మే 21, మే 23 తేదీల్లో ప్లే ఆఫ్స్ జరగనుండగా.. మే 25న ఫైనల్ జరగనుంది. ఒకవేళ రొమారియో షెపర్డ్ దూరమైతే.. ఆర్‌సీబీ నష్టం జరగనుంది.

టైటిల్ దిశగా ఆర్‌సీబీ..
ఈ సీజన్‌లో ఆర్‌సీబీ దుమ్మురేపుతోంది. ఎన్నడూ లేని విధంగా సమష్టి ప్రదర్శనతో టైటిల్ దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడిన ఆర్‌సీబీ 8 విజయాలతో పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆర్‌సీబీలోని ఆటగాళ్లంతా సూపర్ ఫామ్‌లో ఉన్నారు.

Story first published: Tuesday, May 6, 2025, 16:59 [IST]
Other articles published on May 6, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+