గుజరాత్ టైటాన్స్ స్టార్ పేసర్, హైదరాబాద్ డీఎస్పీ మహమ్మద్ సిరాజ్(3/19) నిప్పులు చెరిగాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా తన పాత ఫ్రాంచైజీ ఆర్‌సీబీతో బెంగళూరు వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో సిరాజ్ తనదైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. దేవదత్ పడిక్కల్(7), ఫిల్ సాల్ట్(14)లతో పాటు క్రీజులో సెట్ అయిన లియామ్ లివింగ్ స్టోన్‌లను సిరాజ్ స్టన్నింగ్ డెలివరీలతో పెవిలియన్ చేర్చాడు. పిచ్ నుంచి లభించిన సహకారాన్ని అందిపుచ్చుకున్న సిరాజ్.. తొలి ఓవర్ నుంచే ఆర్‌సీబీ బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు.
ఆర్‌సీబీని దెబ్బతీసిన మియా భాయ్
తన తొలి ఓవర్‌లోనే ఫిల్ సాల్ట్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను వికెట్ కీపర్ జోస్ బట్లర్ నేలపాలు చేశాడు. తన మరుసటి ఓవర్‌లో దేవదత్ పడిక్కల్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన సిరాజ్.. తన మూడో ఓవర్‌లో డేంజరస్ ఫిల్ సాల్ట్‌ను కూడా క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో ఆర్‌సీబీ 35 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. చివర్లో లియామ్ లివింగ్ స్టోన్(40 బంతుల్లో ఫోర్, 5 సిక్స్‌లతో 54) పెవిలియన్ చేర్చాడు. దాంతో ఈ మ్యాచ్‌లోముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 169 పరుగులు చేసింది.

లియామ్ లివింగ్ స్టోన్ హాఫ్ సెంచరీకి తోడు జితేష్ శర్మ(21 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 33), టీమ్ డేవిడ్(18 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32) మెరుపులు మెరిపించారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో మహమ్మద్ సిరాజ్‌తో పాటు సాయి కిషోర్(2/22) రెండు వికెట్లు పడగొట్టాడు. అర్షద్ ఖాన్, ఇషాంత్ శర్మ తలో వికెట్ తీసారు.
జోష్‌లో సిరాజ్..
ముంబై ఇండియన్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో సిరాజ్(2/34) నిప్పులు చెరిగాడు. స్టన్నింగ్ డెలివరీతో రోహిత్ శర్మను క్లీన్ బౌల్డ్ చేశాడు. పంజాబ్‌తో మ్యాచ్‌లో దారళంగా పరుగులిచ్చి ఈ సీజన్‌ను పేలవంగా ప్రారంభించిన సిరాజ్.. తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో అదిరిపోయే ప్రదర్శనను కనబర్చాడు.
గత సీజన్ వరకు ఆర్‌సీబీకి ఆడిన సిరాజ్.. ఇదే బెంగళూ మైదానంలో ఆ జట్టు తరఫున ఇలాంటి ప్రదర్శన చేయలేదు. కానీ తాజా మ్యాచ్‌లో అసాధారణ ప్రదర్శన కనబర్చడంతో ఆర్‌సీబీ ఫ్యాన్స్ అవాక్కవుతున్నారు. ఆర్‌సీబీ దరిద్రమో లేక.. సిరాజ్ అదృష్టమో తెలియడం లేదని కామెంట్ చేస్తున్నారు.
తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం..
మరికొందరు తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదేనని అసహనం వ్యక్తం చేస్తున్నారు. మహమ్మద్ సిరాజ్ మెరుగైన ప్రదర్శన చేయకున్నా.. కొన్ని సీజన్ల పాటు ఫ్రాంచైజీ అతనికి అండగా నిలిచింది. ప్రతీ సారి రిటైన్ చేసుకుంటూ వచ్చింది. ఈ విషయాన్ని సిరాజ్ సైతం ఎన్నో ఇంటర్వ్యూలో చెప్పాడు. తాజా మ్యాచ్‌కు ముందు కూడా ఆర్‌సీబీకి వ్యతిరేకంగా ఆడటం చాలా ఎమోషనల్‌గా ఉందని కూడా చెప్పాడు. ఆర్‌సీబీ తరఫున విఫలమైన సిరాజ్.. ఇప్పుడు ప్రత్యర్థి జట్టు తరఫున చెలరేగుతున్నాడు.