Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: బీసీసీఐ నయా రూల్.. ఇక టాస్‌తో భయం లేదు!

ఐపీఎల్ 2025 సీజన్ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కీలక నిర్ణయాలు తీసుకుంది. మార్చి 22 నుంచి ఈ క్యాష్ రిచ్ లీగ్‌కు తెరలేవనుండగా.. గురువారం పది ఫ్రాంచైజీల కెప్టెన్లతో బీసీసీఐ సమావేశం నిర్వహించింది. పలు అంశాలే ఏజెండాగా జరిగిన ఈ సమావేశంలో బీసీసీఐ కీలక నిర్ణయాలు తీసుకుంది. లీగ్‌లో చేయాల్సిన మార్పుల చేర్పులపై సలహాలు, సూచనలను కెప్టెన్లను స్వీకరించింది.

1. సలైవాపై నిషేధం ఎత్తివేత..
ఐపీఎల్ సారథుల విజ్ఞప్తి మేరకు సలైవా‌పై విధించిన నిషేధాన్ని ఎత్తేసింది. ఇక నుంచి బౌలర్లు బంతి షైన్ కోసం ఉమ్మిని వాడవచ్చు. సాధారణంగా సలైవా వాడటం వల్ల బంతి తన మెరుపును కోల్పోకుండా ఉండి రివర్స్ స్వింగ్‌కు సహకరిస్తోంది. ఎన్నో ఏళ్లుగా బౌలర్లు ఉమ్మిని వాడుతున్నప్పటికీ.. కరోనా నేపథ్యంలో సలైవాను వాడకుండా ఐసీసీ నిషేధం విధించింది. ఇప్పడు కరోనా ప్రభావం లేకపోవడంతో ఈ నిషేధాన్ని ఎత్తేయాలని బౌలర్లు కోరారు. ఈ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న బీసీసీఐ.. ఈ నిషేధాన్ని ఎత్తేసింది.

IPL 2025 BCCI changes major rules Saliva ban lifted two balls for 2nd innings

2. కొంత బంతితో డ్యూ‌కు చెక్
అంతేకాకుండా బ్యాటర్ల ఆధిపత్యం కొనసాగే ఈ ధనాధన్ లీగ్‌లో బౌలర్లకు అనుకూలంగా మరో నిర్ణయాన్ని తీసుకుంది. మ్యాచ్ ఫలితాలపై డ్యూ ప్రభావం చూపిస్తుండటంతో బీసీసీఐ కొత్త రూల్‌ను ప్రవేశ పెట్టింది. అప్‌కమింగ్ సీజన్ నుంచి రెండో ఇన్నింగ్స్‌లో రెండు బంతులను ఉపయోగించనున్నారు. రెండో ఇన్నింగ్స్ 11వ ఓవర్ తర్వాత కొత్త బంతిని ప్రవేశ పెట్టనున్నారు. దాంతో మ్యాచ్ ఫలితాలపై టాస్ ప్రభావం కూడా తగ్గనుంది. గతంలో టాస్ గెలిచిన జట్లు ఎక్కువగా ఫీల్డింగ్ ఎంచుకునేవి.

డ్యూ ప్రభావం కారణంగా రెండో ఇన్నింగ్స్‌లో బంతి తడిగా మారి బౌలర్ల చేతుల్లో నుంచి జారిపోయేది. దాంతో కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌లో బంతులు వేయలేక బౌలర్లు పరుగులు సమర్పించుకునేవారు. రెండో ఇన్నింగ్స్ 11వ ఓవర్ తర్వాత కొత్త బంతిని ప్రవేశపెడితే బౌలర్లకు ఆ సమస్య తప్పనుంది. అయితే రాత్రి జరిగే మ్యాచ్‌లకు మాత్రమే ఈ రూల్‌ను అమలు చేయనున్నారు. అది కూడా 11వ ఓవర్ తర్వాత డ్యూ ఉందా? లేదా? అని అంపైర్ పరిశీలించి కొత్త బంతి‌పై నిర్ణయం తీసుకుంటారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లను ఒక్క బంతితోనే ఆడిస్తారు.

3. ఇంపాక్ట్ రూల్‌ కొనసాగింపు..
ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను తీసేయాలనే డిమాండ్‌ను బీసీసీఐ పట్టించుకోలేదు. ఈ రూల్ కారణంగా ఆల్‌రౌండర్లకు అన్యాయం జరుగుతుందని రోహిత్ శర్మ వంటి ఆటగాళ్లు అభిప్రాయపడ్డారు. ఈ విమర్శల నేపథ్యంలోనే ఈ రూల్‌ను ఎత్తేస్తారనే ప్రచారం జరిగింది. కానీ యువ ఆటగాళ్లకు మేలు చేస్తున్న ఈ రూల్‌ను కొనసాగించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఎంతో మంది యువ ఆటగాళ్లు ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగి సత్తా చాటారు. అయితే ఈ రూల్స్‌ మార్పులపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు.

Story first published: Thursday, March 20, 2025, 16:10 [IST]
Other articles published on Mar 20, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+