ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ తొలి రోజు మొత్తం 84 మంది ఆటగాళ్లను వేలం వేయగా.. 72 మందిని ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. మరో 12 మందిని కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు. కొనుగోలు చేసిన 72 మంది ఆటగాళ్ల కోసం పది ఫ్రాంచైజీలు రూ. 467.95 కోట్లు ఖర్చు చేశాయి. టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ అత్యధికంగా రూ. 27 కోట్ల ధర పలికి చరిత్ర సృష్టించగా.. శ్రేయస్ అయ్యర్ రూ. 26.75 కోట్లు, వెంకటేశ్ అయ్యర్ రూ. 23. 75 కోట్ల భారీ ధరను సొంతం చేసుకున్నారు.
అయితే ఆశ్చర్యకరంగా స్టార్ ప్లేయర్లు అయిన డేవిడ్ వార్నర్, దేవదత్ పడిక్కల్, జానీ బెయిర్ స్టో, పియూష్ చావ్లా వంటి ఆటగాళ్లకు ఊహించని షాక్ తగిలింది. ఈ స్టార్ ఆటగాళ్లను తీసుకునేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపించలేదు. దాంతో వీరు అన్‌సోల్డ్‌గా నిలిచారు. తొలి రోజు వేలంలో మొత్తం 12 మంది ఆటగాళ్లు అన్‌సోల్డ్‌గా నిలిచారు. ఇందులో నుంచి కొంతమందికి మరోసారి అవకాశం ఇవ్వనున్నారు.

తొలిరోజు వేలంలో అమ్ముడు పోని ఆటగాళ్ల జాబితా ఇదే
దేవదత్ పడిక్కల్-అన్ సోల్డ్
డేవిడ్ వార్నర్-అన్‌సోల్డ్
జానీ బెయిర్ స్టో-అన్‌సోల్డ్
వాకర్ సలామ్‌కేలీ- అన్‌సోల్డ్
అన్‌మోల్ ప్రీత్ సింగ్-అన్‌సోల్డ్
యశ్ ధుల్-అన్‌సోల్డ్
ఉత్కర్ష్ సింగ్-అన్‌సోల్డ్
ఉపేంద్ర యాదవ్-అన్‌సోల్డ్
లువ్‌నిత్ సిసోడియా-అన్‌సోల్డ్
కార్తీక్ త్యాగీ-అన్‌సోల్డ్
పియూష్ చావ్లా-అన్‌సోల్డ్
శ్రేయస్ గోపాల్-అన్‌సోల్డ్