లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా రిషభ్ పంత్ తన ప్రయాణాన్ని ఓటమితో ప్రారంభించాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా తన పాత ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్‌తో సోమవారం వైజాగ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో రిషభ్ పంత్ పేలవ ప్రదర్శన కనబర్చాడు. బ్యాటింగ్, కీపింగ్‌లో తీవ్రంగా నిరాశపర్చిన పంత్.. కెప్టెన్‌గానూ విఫలమయ్యాడు. అతని చెత్త కెప్టెన్సీ కారణంగా 210 పరుగుల భారీ లక్ష్యాన్ని లక్నో కాపాడుకోలేకపోయింది. సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్‌లో లక్నో ఓటమిపాలైంది.
మరోవైపు అశుతోష్ శర్మ సంచలన బ్యాటింగ్‌తో ఓడిపోవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఒక్క వికెట్ తేడాతో గెలుపొందింది. ఈ ఓటమి నేపథ్యంలో రిషభ్ పంత్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. కెప్టెన్‌గా అతను తీసుకున్న నిర్ణయాలపై మాజీ క్రికెటర్లతో పాటు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుభారంభం అందించిన శార్దూల్ ఠాకూర్‌ను రెండు ఓవర్లకే పరిమితం చేయడంతో పాటు చివర్లో స్పిన్నర్లతో బౌలింగ్ చేయించడాన్ని తప్పుబడుతున్నారు. చివర్లో శార్దూల్ ఠాకూర్‌కు బంతి అందించి ఉంటే ఫలితం మరోలా ఉండేదని అభిప్రాయపడుతున్నారు.

ఈ మ్యాచ్ అనంతరం రిషభ్ పంత్ కెప్టెన్సీ గురించి మాట్లాడిన మాజీ క్రికెటర్ అంబటి రాయుడు.. ధోనీలా కెప్టెన్సీ చేయబోయి మూల్యం చెల్లించుకున్నాడని అభిప్రాయపడ్డాడు. ధోనీనే చివర్లో స్పిన్నర్లతో బౌలింగ్ చేయించి వికెట్లు రాబడుతాడని, అతన్ని రిషభ్ పంత్ అనుకరించి దెబ్బతిన్నాడని తెలిపాడు. 'రిషభ్ పంత్ ధోనీ కెప్టెన్సీని అనుకరించాడు. ఈ తరహా వికెట్లపై ధోనీనే చివర్లో స్పిన్నర్లతో బౌలింగ్ చేయిస్తాడు. ఇది ఏ మాత్రం రిషభ్ పంత్ కెప్టెన్సీ కాదు. అతని బౌలింగ్ ప్రణాళికలు దెబ్బతీసాయి.'అని అంబటి రాయుడు చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన రిషభ్ పంత్ వీలైనంత త్వరగా ఈ ఓటమిని మరిచి ముందకు సాగుతామని తెలిపాడు. 'జట్టులో బౌలింగ్ ఆప్షన్ చాలా ఉన్నాయి. కానీ మేం బేసిక్స్‌కు తగ్గట్లు ఆడాం. మేం ఒత్తిడికి లోనయ్యాం. ఈ మ్యాచ్‌లో ఓడినా చాలా సానుకూలంశాలు ఉన్నాయి. లక్ కూడా ఈ మ్యాచ్‌లో కీలక పాత్ర పోషించింది. మోహిత్ శర్మ స్టంపౌట్ అవకాశం చేజారింది. క్రికెట్‌లో ఇలాంటి తప్పిదాలు జరగడం సాధారణమే. ఇలాంటి విషయాలను పట్టించుకోకుండా మెరుగైన క్రికెట్ ఆడటంపై ఫోకస్ పెట్టాలి.'అని పంత్ చెప్పుకొచ్చాడు.