Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ.. యువరాజ్ సింగ్ శిష్యుడా? మజాకా!

సన్‌రైజర్స్ హైదరాబాద్ విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే వరుసగా రెండు సీజన్లలో 400 ప్లస్ పరుగులు చేయడంతో పాటు అత్యధిక స్ట్రైక్‌రేట్ కలిగిన ఆటగాడిగా అభిషేక్ శర్మ నిలిచాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆదివారం జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ 16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32 పరుగులు చేశాడు. దాంతో ఈ సీజన్‌ను అభిషేక్ శర్మ 14 మ్యాచ్‌ల్లో 193.39 స్ట్రైక్‌రేట్‌తో 439 పరుగులు చేశాడు. గత సీజన్‌లో అభిషేక్ శర్మ 16 మ్యాచ్‌ల్లో 204.22 స్ట్రైక్‌రేట్‌తో 484 పరుగులు చేశాడు. దాంతో అరుదైన ఘనతను అందుకున్నాడు.

ఈ ఏడాది 300 కంటే ఎక్కువ పరుగులు చేసిన బ్యాటర్లలో అభిషేక్ శర్మ అత్యధిక స్ట్రైక్ రేట్ కలిగి ఉన్నాడు. గతేడాది కూడా స్ట్రైక్ రేట్‌ విషయంలో అభిషేక్ శర్మనే టాప్‌గా నిలిచాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్‌లో వరుస సీజన్లలో 400 ప్లస్ రన్స్ చేయడంతో పాటు 190 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ కలిగిన ఆటగాడినా నిలిచాడు. అభిషేక్ శర్మ కంటే ముందు గ్లేన్ మ్యాక్స్‌వెల్ మాత్రమే రెండు సార్లు 400 కంటే ఎక్కువ పరుగులు చేయడంతో పాటు 180 ప్లస్ స్ట్రైక్‌రేట్ నమోదు చేశాడు.

IPL 2025 Abhishek Sharma Creates History With Stunning World Record

ఐపీఎల్‌లో అభిషేక్ శర్మ మూడో సారి 400 ప్లస్ రన్స్ చేశాడు. 2022లో 133.12 స్ట్రైక్‌రేట్‌తో 426 పరుగులు చేసిన అభిషేక్ శర్మ.. యువరాజ్ సింగ్ శిక్షణలో రాటు దేలాడు. ఈ ఏడాది పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 141 పరుగులు చేసి తొలి సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఓ భారత ఆటగాడిగా అత్యధిక స్కోర్ ఇదే. ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ పాయింట్స్ టేబుల్‌లో ఆరో స్థానంతో సరిపెట్టుకుంది.

Story first published: Monday, May 26, 2025, 10:40 [IST]
Other articles published on May 26, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+