Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ!

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున అత్యంత వేగంగా సెంచరీ నమోదు చేసిన తొలి భారత బ్యాటర్‌గా నిలిచాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా శనివారం ఉప్పల్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మ ఈ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్‌లో 40 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్న అభిషేక్ శర్మ.. మొత్తం 55 బంతుల్లో 14 ఫోర్లు, 10 సిక్స్‌లతో 141 పరుగులు చేశాడు.

ఈ క్రమంలో అతను ఇషాన్ కిషన్ రికార్డ్ బద్దలు కొట్టాడు. ఆరెంజ్ ఆర్మీ తరఫున ఐపీఎల్‌లో ఫాస్టెస్ సెంచరీ చేసిన ఇండియన్ బ్యాటర్‌గా నిలిచాడు. ఈ సీజన్‌లోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున రాజస్థాన్ రాయల్స్‌పై అరంగేట్ర మ్యాచ్‌లోనే ఇషాన్ కిషన్ 45 బంతుల్లో సెంచరీ నమోదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ రికార్డ్‌ను అభిషేక్ శర్మ బ్రేక్ చేశాడు.

IPL 2025 Abhishek Sharma Creates History For SRH After After 40-Ball 100

అరుదైన రికార్డ్..
ఓవరాల్‌గా సన్‌రైజర్స్ బ్యాటర్ల ఫాస్టెస్ సెంచరీల జాబితాలో ట్రావిస్ హెడ్ టాప్‌లో ఉన్నాడు. గతేడాది అతను ఆర్‌సీబీపై 39 బంతుల్లో సెంచరీ సాధించాడు. డేవిడ్ వార్నర్ మూడో స్థానంలో ఉన్నాడు. 2017లో అతను సెంచరీ అందుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే మూడో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన బ్యాటర్‌గా అభిషేక్ శర్మ రికార్డ్ సాధించాడు. ఈ జాబితాలో క్రిస్ గేల్(175 నాటౌట్), బ్రెండన్ మెక్‌కల్లమ్(158 నాటౌట్) అభిషేక్ శర్మ(141) కంటే ముందున్నారు.

పంజాబ్ కింగ్స్ ఫీల్డర్ల తప్పిదాలతో పాటు యశ్ ఠాకూర్ నోబాల్‌తో ఔటయ్యే ప్రమాదం నుంచి బచాయించిన అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అభిషేక్.. మరో 21 బంతుల వ్వవధిలో సెంచరీ మార్క్ అందుకున్నాడు. ట్రావిస్ హెడ్‌తో కలిసి తొలి వికెట్‌కు 171 పరుగులు జోడించిన అభిషేక్.. క్లాసెన్‌తో కలిసి రెండో వికెట్‌కు 51 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు.

పాపం అయ్యర్..
ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. నాలుగు పరాజయాల తర్వాత రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 245 పరుగుల భారీ స్కోర్ చేసింది. శ్రేయస్ అయ్యర్(36 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 82) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. ప్రభ్‌సిమ్రాన్ సింగ్(23 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 42), ప్రియాన్ష్ ఆర్య(13 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 36) రాణించారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో హర్షల్ పటేల్(4/42) నాలుగు వికెట్లు తీయగా.. ఇషాన్ మలింగా(2/45) రెండు వికెట్లు పడగొట్టాడు.

అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ 18.3 ఓవర్లలో 2 వికెట్లకు 247 పరుగులు చేసి గెలుపొందింది. అభిషేక్ శర్మ‌తో పాటు ట్రావిస్ హెడ్(37 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 66) హాఫ్ సెంచరీతో రాణించాడు. హెన్రీచ్ క్లాసెన్(14 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 21 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ చెరో వికెట్ తీసారు. ఈ మ్యాచ్‌లో మొత్తం 30 సిక్సర్లు.. 44 బౌండరీలు నమోదయ్యాయి.

Story first published: Sunday, April 13, 2025, 1:21 [IST]
Other articles published on Apr 13, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+