Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2026: ధోనీతో సహా ఆ ఐదుగురు ఔట్.. సీఎస్‌కే వదిలేసే ఆటగాళ్ల జాబితా ఇదే!

ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) తీవ్రంగా నిరాశపరిచింది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన సీఎస్‌కే లీగ్ దశలోనే ఇంటి ముఖం పట్టింది. భారీ విజయంతో ఈ సీజన్‌ను ప్రారంభించిన సీఎస్‌కే ఆ తర్వాత వరుస పరాజయాలతో చతికిల పడింది. 14 మ్యాచ్‌ల్లో 4 మ్యాచ్‌లు మాత్రమే గెలిచి పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగు స్థానంలో నిలిచింది. ఐపీఎల్ చరిత్రలోనే వరుసగా రెండు సీజన్లలో ప్లే ఆఫ్స్ సీఎస్‌కే ప్లే ఆఫ్స్ చేరకపోవడం ఇదే తొలిసారి. బ్యాటింగ్ వైఫల్యంతో పాటు గాయాల బెడద ఆ జట్టు విజయవకాశాలను దెబ్బతీసింది. ముఖ్యంగా రవిచంద్రన్ అశ్విన్, రాహుల్ త్రిపాటి, దీపక్ హుడా, విజయ్ శంకర్‌తో పాటు ధోనీ వైఫల్యం సీఎస్‌కే కొంపముంచింది. కెప్టెన్ రజత్ పటీదార్ గాయంతో టోర్నీకి దూరమవ్వడం కూడా సీఎస్‌కేకు నష్టం చేసింది.

ఈ సీజన్ వైఫల్యం నేపథ్యంలో సీఎస్‌కే జట్టులో భారీ మార్పులు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా నలుగురి ఆటగాళ్లను వదిలేసే అవకాశం ఉంది. ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తే అతను కూడా జట్టుకు దూరం కానున్నాడు. రిటైర్మెంట్‌పై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, మరో ఐదు నెలల తర్వాత తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని ధోనీ చెప్పాడు.

IPL 2025 5 Players CSK Likely to Release Ahead of IPL 2026 Mini-Auction

సీఎస్‌కే వదిలేసే ఆటగాళ్లు..

1. రాహుల్ త్రిపాఠి
ఐపీఎల్ 2025 మెగా వేలంలో రాహుల్ త్రిపాఠిని సీఎస్‌కే రూ. 3.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. మిడిలార్డర్‌లో కీలకమవుతాడని సీఎస్‌కే భావించగా.. అతను 5 మ్యాచ్‌ల్లో 11 సగటుతో 55 పరుగులే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. పేలవ ఫామ్‌తో తుది జట్టులో చోటు కూడా కోల్పోయాడు. సీఎస్‌కే విడుదల చేసే ఆటగాళ్ల జాబితాలో రాహుల్ త్రిపాఠి తొలి స్థానంలో ఉంటాడు.

2. దీపక్ హుడా
ఐపీఎల్ 2025 మెగా వేలంలో దీపక్ హుడాను సీఎస్‌కే రూ. 1.70 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. కానీ అతను 7 మ్యాచ్‌ల్లో 6.20 సగటుతో 31 పరుగులే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. వరుసగా అవకాశాలు ఇచ్చినా.. సీఎస్‌కే మేనేజ్‌మెంట్ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు.

3. విజయ్ శంకర్
లోకల్ ప్లేయర్, పేస్ ఆల్‌రౌండర్ అని రూ. 1.25 కోట్లకు కొనుగోలు చేసిన విజయ్ శంకర్ కూడా జట్టుకు భారంగా మారాడు. 6 మ్యాచ్‌ల్లో 118 పరుగులే చేశాడు. జిడ్డు బ్యాటింగ్‌తో అభిమానులను విసిగించాడు. ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయలేదు. విజయ్ శంకర్‌కు కూడా సీఎస్‌కే ఉద్వాసన పలకనుంది.

4. రవిచంద్రన్ అశ్విన్
ఐపీఎల్ 2025 మెగా వేలంలో రూ. 9.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన రవిచంద్రన్ అశ్విన్ కూడా చేతులెత్తేసాడు. సుదీర్ఘం కాలం తర్వాత సీఎస్‌కేలోకి రీఎంట్రీ ఇచ్చిన అశ్విన్.. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తాడని అంతా భావించారు. కానీ అతను 9 మ్యాచ్‌ల్లో 9.13 ఎకానమీతో 7 వికెట్లు మాత్రమే తీసాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అశ్విన్‌ను కూడా సీఎస్‌కే వదిలేసే అవకాశాలు ఉన్నాయి.

5. మహేంద్ర సింగ్ ధోనీ
అనామక ప్లేయర్‌గా ఈ సీజన్ ఆడిన ధోనీ.. రుతురాజ్ గైక్వాడ్ దూరమవ్వడంతో జట్టును నడిపించాడు. 14 మ్యాచ్‌ల్లో 24.50 సగటుతో 196 పరుగులు చేశాడు. అయితే అతని జిడ్డు బ్యాటింగ్ కొన్ని మ్యాచ్‌ల్లో సీఎస్‌కే విజయవకాశాలు దెబ్బతీసింది.

Story first published: Friday, May 30, 2025, 17:40 [IST]
Other articles published on May 30, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+