ఐపీఎల్ 2025 మెగావేలానికి సన్‌రైజర్స్ హైదరాబాద్ సమాయత్తమవుతోంది. ఐపీఎల్ 2024 సీజన్‌లో అసాధారణ ప్రదర్శనతో ఫైనల్ చేరి తృటిలో టైటిల్ చేజార్చుకున్న సన్‌రైజర్స్ రన్నరప్‌గా నిలిచింది. 2016, 2018 సీజన్ల తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ మెరుగైన ప్రదర్శన చేసిన సీజన్ ఇదే. ప్యాట్ కమిన్స్ సారథ్యంలో సన్‌రైజర్స్ దుమ్మురేపింది.
విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆల్‌టైమ్ రికార్డ్ స్కోర్స్ నమోదు చేసింది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రీచ్ క్లాసెన్ విధ్వంసకర బ్యాటింగ్‌తో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ రికార్డ్ అందుకుంది. ఈ అసాధారణ ప్రదర్శన నేపథ్యంలోనే మెగా వేలాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ వ్యతిరేకించింది.

కనీసం 8 మంది ఆటగాళ్లనైనా రిటైన్ చేసుకునే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేసింది. కానీ మెగా వేలం రూల్స్ ప్రకారం నలుగురిని మాత్రమే రిటైన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు అయితే బీసీసీఐ ఇంకా రిటెన్షన్ పాలసీని ప్రకటించలేదు. కానీ నలుగురి కంటే ఎక్కువ రిటైన్ చేసుకునే ఛాన్స్ ఉండదని తెలుస్తోంది.
నలుగురికి మాత్రమే అవకాశం ఇస్తే సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌తో పాటు అనామక ప్లేయర్ అయిన నితీష్ కుమార్ రెడ్డి, విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ, హెన్రీచ్ క్లాసెన్‌లను రిటైన్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఆర్‌టీఎమ్ కింద మరో ప్లేయర్‌ను తీసుకునే అవకాశం ఇస్తే నటరాజన్, ట్రావిస్ హెడ్‌ల్లో ఒకరిని తీసుకుంటుంది.
SRH రిటైన్ చేసుకునే ఆటగాళ్లు

1.ప్యాట్ కమిన్స్
సన్‌రైజర్స్ హైదరాబాద్ రిటైన్ చేసుకునే తొలి ఆటగాడు ప్యాట్ కమిన్స్. అప్‌కమింగ్ సీజన్‌లోనూ అతన్నే కెప్టెన్‌గా కొనసాగించే అవకాశం ఉంది. అయితే సన్‌రైజర్స్ రిటెన్షన్‌కు ప్యాట్ కమిన్స్ ఒప్పుకుంటాడా? లేదా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. మెగా వేలంలో సమయంలో ప్యాట్ కమిన్స్ దూరంగా ఉంటాటు. మినీ వేలం సందర్భంగా రీఎంట్రీ ఇస్తూ.. భారీ ధరను సొంతం చేసుకుంటాడు.

2. నితీష్ కుమార్ రెడ్డి
రిటైన్షన్ లిస్ట్ ఓ అనామక ప్లేయర్‌ను తీసుకోవాలనే రూల్ ఉంటుంది. అది ఈసారి కూడా అమలు చేస్తే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆ ఆప్షన్ కింద నితీష్ కుమార్ రెడ్డిని ఎంచుకుంటుంది. నాలుగో ప్లేయర్‌గా అతన్ని రిటైన్ చేసుకుంటుంది.

3. అభిషేక్ శర్మ
మూడో రిటెన్షన్‌గా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మను సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎంచుకోనుంది. ఐపీఎల్ 2024 సీజన్‌లో అతను అసాధారణ ప్రదర్శన కనబర్చాడు.

4. హెన్రీచ్ క్లాసెన్
విధ్వంసకర వికెట్ కీపర్ హెన్రీచ్ క్లాసెన్‌ను కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనసాగించనుంది. విధ్వంసకర బ్యాటింగ్‌తో పాటు వికెట్ కీపింగ్ జట్టుకు కలిసిరానుంది.