Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: ఆర్‌సీబీ వదిలేసిన ఆటగాళ్లపై కన్నేసిన సీఎస్‌కే!

ఐపీఎల్ 2025 మెగా వేలానికి రంగం సిద్దమైంది. ఈ నెల 26, 27వ తేదీల్లో మెగా వేలం నిర్వహించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే రిటెన్షన్ ప్రక్రియ ముగియగా.. 10 ఫ్రాంచైజీలు తాము అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాలను విడుదల చేసి వేలం వ్యూహాలపై ఫోకస్ పెట్టాయి.

వేలంలో టార్గెట్ చేయాల్సిన ఆటగాళ్లు, వారికి బ్యాకప్ ప్లేయర్లను సిద్దం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఆక్షన్ వ్యూహాలను రెడీ చేసుకుంటోంది. రిటెన్షన్ ప్రక్రియలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజాలను రూ. 18 కోట్లకు తీసుకున్న సీఎస్‌కే.. మతీష పతీరణ రూ. 13 కోట్లు, శివమ్ దూబే రూ. 12 కోట్లు, ధోనీని రూ. 4 కోట్లకు రిటైన్ చేసుకుంది. రిటెన్షన్‌కే రూ. 65 కోట్లు ఖర్చు పెట్టిన సీఎస్‌కే పర్స్ వాల్యూలో ఇంకా రూ. 55 కోట్లు ఉన్నాయి. ఐదుగురి ఆటగాళ్లనే రిటైన్ చేసుకోవడంతో ఆ జట్టుకు ఒక ఆర్‌టీఎమ్ కార్డ్ ఉంది. మిగిలిన 55 కోట్లతోనే సీఎస్‌కే మరో 17 నుంచి 18 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయాలి.

IPL 2025 3 Released RCB Players CSK Might Target in Mega Auction

డాడీస్ ఆర్మీగా గుర్తింపు పొందిన సీఎస్‌కే అనుభవం కలిగిన ఆటగాళ్లకే ప్రాధాన్యత ఇస్తోంది. ఈ క్రమంలోనే ఆర్‌సీబీ వదిలేసిని ముగ్గురు ఆటగాళ్లపై సీఎస్‌కే ఫోకస్ పెట్టింది. వేలంలో కొనుగోలు చేసేందుకు వ్యూహాలు రచిస్తోంది.

1. ఫాఫ్ డుప్లెసిస్..
సీఎస్‌కే టార్గెట్ చేసిన ఆటగాళ్లలో ఆర్‌సీబీ మాజీ కెప్టెన్, సౌతాఫ్రికా దిగ్గజం ఫాఫ్ డుప్లెసిస్ ఉన్నాడు. ఆర్‌సీబీకి ముందు ఫాఫ్ డుప్లెసిస్ చెన్నై సూపర్ కింగ్స్‌కే ఆడాడు. ప్రస్తుతం సీఎస్‌‌కేకు ఒక ఓపెనర్ కావాలి. రుతురాజ్ గైక్వాడ్‌కు జతగా ఫాఫ్ డుప్లెసిస్ సరిగ్గా సరిపోతాడని ఆ జట్టు భావిస్తోంది. అయితే ఫాఫ్ డుప్లెసిస్ కోసం ఆర్‌సీబీ ఆర్‌టీఎమ్ కార్డ్ ఉపయోగించే అవకాశం ఉంది. డుప్లెసిస్‌ను ఆర్‌సీబీ పట్టించుకోకుంటే మాత్రం సీఎస్‌కే తమ జట్టులోకి తీసుకుంటుంది.

2. గ్లేన్ మ్యాక్స్‌వెల్..
విధ్వంసకర ఆల్‌రౌండర్, ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ గ్లేన్ మ్యాక్స్‌వెల్‌ను కూడా తీసుకునేందుకు సీఎస్‌కే ఆసక్తి కనబరుస్తోంది. మిడిలార్డర్‌లో దూకుడుగా ఆడటంతో పాటు బౌలింగ్ చేసే సామర్థ్యం ఉన్న గ్లేన్ మ్యాక్స్‌వెల్ చెన్నై చెపాక్ మైదానానికి సరిగ్గా సరిపోతాడని సీఎస్‌కే భావిస్తోంది. అయితే మ్యాక్సీ కోసం కూడా ఆర్‌సీబీ ఆర్‌టీఎమ్ కార్డు ఉపయోగించవచ్చు. ఆ జట్టుకు మొత్తం మూడు ఆర్‌టీఎమ్ కార్డ్స్ ఉన్నాయి. ఆర్‌సీబీ పట్టించుకోకుంటే మాత్రం సీఎస్‌కే.. మ్యాక్సీ కోసం గట్టిగా ప్రయత్నించనుంది.

3. విల్ జాక్స్..
ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ విల్ జాక్స్‌ను కొనుగోలు చేసేందుకు కూడా సీఎస్‌కే ఆసక్తి కనబరుస్తోంది. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ చేయగలే విల్ జాక్స్‌ను తీసుకుంటే బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లో డెప్త్ పెరుగుతుందని సీఎస్‌కే భావిస్తోంది. అతని అనుభవం తమ జట్టుకు కలిసొస్తుందని అనుకుంటుంది.

Story first published: Friday, November 8, 2024, 21:57 [IST]
Other articles published on Nov 8, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+