For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2025: కావ్య పాప మార్క్ సెలెక్షన్.. SRH ఆక్షన్ ప్లాన్.. టార్గెటెడ్ ఎలెవన్ ఇదే..!

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2025 మెగా వేలానికి రంగం సిద్దమైంది. మరికొద్ది గంటల్లో సౌదీ అరేబియాలోని జడ్డా వేదికగా ఈ మెగా వేలానికి తెరలేవనుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ మెగా ఆక్షన్ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది. ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ టైమింగ్స్ క్లాష్ కాకుండా ఐపీఎల్ నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఐపీఎల్ 2025 మెగా వేలంలో పాల్గొనేందుకు మొత్తం 1574 మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకోగా.. భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) 574 మందిని షార్ట్ లిస్ట్ చేసింది. రిటెన్షన్ ప్రక్రియ అనంతరం పది ఫ్రాంచైజీల్లోని 204 స్థానాల కోసం ఈ 574 మంది ఆటగాళ్లు పోటీపడనున్నారు. ఇప్పటికే పది ఫ్రాంచైజీలు తమ వ్యూహాలను సిద్దం చేసుకున్నాయి.

SRH and team owner Kavya Maran to carefully plan IPL 2025 mega auction plan due to low budget

రూ. 45 కోట్లతో కావ్య పాప..
సన్‌రైజర్స్ హైదరాబాద్ సైతం తమ కోర్ టీమ్ తగ్గట్లుగా ఆటగాళ్లను ఎంచుకోవడంపై కన్నేసింది. వేలంలో టార్గెట్ చేయాల్సిన ఆటగాళ్ల జాబితాలను సిద్దం చేసుకుంది. రిటెన్షన్ ప్రక్రియలో మొత్తం ఐదుగురి ఆటగాళ్లను రిటైన్ చేసుకున్న ఆరెంజ్ ఆర్మీ వారి కోసం రూ. 75 కోట్లు ఖర్చు చేసింది. హెన్రీచ్ క్లాసెన్(రూ. 23 కోట్లు), ప్యాట్ కమిన్స్(రూ. 18 కోట్లు), రూ. అభిషేక్ శర్మ(రూ. 14 కోట్లు), ట్రావిస్ హెడ్(రూ. 14 కోట్లు), తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డిని రూ. 6 కోట్లకు తీసుకుంది.

ఐదుగురి ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకోవడంతో సన్‌రైజర్స్‌కు ఓ ఆర్‌టీఎమ్ ఆప్షన్ ఉంది. అయితే ఆ కార్డును అనామక ఆటగాళ్ల కోసమే ఉపయోగించాల్సి ఉంది. ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ పర్స్‌లో రూ. 45 కోట్లు మాత్రమే ఉన్నాయి. ఈ డబ్బులతో గరిష్టంగా 20 మంది.. కనిష్టంగా 18 మంది ఆటగాళ్లను తీసుకోవాల్సి ఉంది. గత సీజన్ మినీ వేలం తరహాలోనే ఆరెంజ్ ఆర్మీ ఓనర్ కావ్య మారన్ ట్రేడ్ మార్క్ లిస్ట్‌ను తయారు చేసింది.

సన్‌రైజర్స్ టార్గెట్ చేసే బ్యాటర్ల లిస్ట్..
దేవదత్ పడిక్కల్(రూ. 2 కోట్ల కనీస ధర), ఇషాన్ కిషన్(రూ. 2 కోట్లు), నమన్ ధిర్(రూ. 30 లక్షలు), అథర్వ టైడ్(రూ. 30 లక్షలు), అబ్దుల్ సమద్(రూ. 30 లక్షలు).

సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మిడిలార్డ్‌లో సత్తా చాటే బ్యాటర్లు కావాలి. ఆ స్లాట్‌ను దేవదత్ పడిక్కల్, ఇషాన్ కిషన్‌తో భర్తీ చేయాలనే లక్ష్యంతో ఆరెంజ్ ఆర్మీ ఉంది. ఈ ఇద్దరు చిక్కకపోతే.. అన్‌క్యాప్‌డ్ జాబితాలో అథర్వ టైడ్, నమన్ ధిర్, అభినవ్ మనోహర్‌లను తీసుకునే ప్రయత్నం చేయనుంది. అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డిలకు బ్యాకప్ ఆల్‌రౌండర్లుగా అబ్దుల్ సమద్‌తో పాటు సమీర్ రిజ్వీని టార్గెట్ చేయనుంది.

SRH and team owner Kavya Maran to carefully plan IPL 2025 mega auction plan due to low budget

సన్‌రైజర్స్ టార్గెట్ చేసే బౌలర్ల లిస్ట్..

మహమ్మద్ షమీ(కనీస ధర రూ. 2 కోట్లు), మహమ్మద్ సిరాజ్(కనీస ధర రూ. 2 కోట్లు), టీ నటరాజన్(రూ. 2 కోట్లు), ఆవేశ్ ఖాన్(రూ. 2 కోట్లు), అకీల్ హోస్సేన్(రూ. 1.50 కోట్లు)

ప్యాట్ కమిన్స్‌కు తోడుగా సన్‌రైజర్స్ హైదరాబాద్ అర్ష్‌దీప్ సింగ్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్ వంటి భారత పేసర్లను సన్‌రైజర్స్ టార్గెట్ చేయనుంది. నటరాజన్, ఆవేశ్ ఖాన్‌ను తీసుకునేందుకు ప్రయత్నించనుంది. అయితే అర్ష్‌దీప్ సింగ్ వేలంలో చిక్కడం కష్టం. ఈ క్రమంలోనే షమీ‌తో పాటు భువనేశ్వర్ కుమార్ కోసం సన్‌రైజర్స్ గట్టిగా ప్రయత్నించవచ్చు. స్పిన్ బౌలింగ్ ఆప్షన్‌లో బడ్జెట్ దృష్ట్యా సన్‌రైజర్స్ అకీల్ హోస్సేన్, పియూష్ చావ్లా, వానిందు హసరంగాల కోసం బిడ్ వేయవచ్చు. చాహల్, అశ్విన్ తక్కువ ధరకు చిక్కడం కష్టం.0000

SRH బ్యాకప్ ఆప్షన్స్:

ప్రసిధ్ కృష్ణ, ఆడమ్ జంపా, నూర్ అహ్మద్, హర్‌ప్రీత్ బ్రార్, అషుతోష్ శర్మ, మయాంక్ అగర్వాల్, రోవ్‌మన్ పోవెల్, మార్కో జాన్సెన్, వాషింగ్టన్ సుందర్, తుషార్ దేశ్‌పాండే, ముఖేష్ కుమార్.

SRH టార్గెటెడ్ ప్లేయింగ్ 12:

ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, దేవదత్ పడిక్కల్, యశ్ ధుల్, హెన్రీచ్ క్లాసెన్, నమన్ ధీర్, నితీష్ రెడ్డి, అబ్దుల్ సమద్, వానిందు హసరంగా, ప్యాట్ కమిన్స్, మహమ్మద్ సిరాజ్, నటరాజన్(ఇంపాక్ట్ ప్లేయర్)

Story first published: Saturday, November 23, 2024, 17:27 [IST]
Other articles published on Nov 23, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+