Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అది ముంబై ఇండియన్స్ ఘోర తప్పిదం: యువరాజ్ సింగ్

ఐపీఎల్ 2024 సీజన్ నేపథ్యంలో కెప్టెన్‌ను మారుస్తూ ముంబై ఇండియన్స్ తీసుకున్న నిర్ణయాన్ని మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తప్పుబట్టాడు. మరో సీజన్ పాటు రోహిత్ శర్మను కెప్టెన్‌గా కొనసాగించాల్సిందని, అతనికి డిప్యూటీగా హార్దిక్ పాండ్యాను నియమించాల్సిందని అభిప్రాయపడ్డాడు.
ఐపీఎల్ 2024 సీజన్ వేలానికి ముందు గుజరాత్ టైటాన్స్‌కు చెందిన హార్దిక్ పాండ్యాను క్యాష్ ట్రేడింగ్ డీల్ ద్వారా జట్టులోకి తెచ్చుకున్న ముంబై ఇండియన్స్.. అతనికి జట్టు సారథ్య బాధ్యతలు అప్పగించింది. జట్టు భవిష్యత్తు కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని వివరణ ఇచ్చింది.

అయితే ఈ నిర్ణయాన్ని ముంబై ఇండియన్స్ అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. కెప్టెన్సీ మార్పు ప్రకటన వెలువడిన గంటల వ్యవధిలోనే లక్షల మంది అభిమానులు ఆ జట్టు సోషల్ మీడియా ఖాతాలను అన్‌ఫాలో చేసి తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంపై టీమ్ సభ్యులైన సూర్యకుమార్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా కూడా ఆగ్రహంగా ఉన్నారు.

IPL 2024 Yuvraj Singh feels Mumbai Indians should continue Rohit Sharma one more year as captain

ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా అసంతృప్తిని వ్యక్తం చేశారు. కెప్టెన్సీ మార్పుపై రోహిత్ శర్మ మౌనంగా ఉన్నా.. అతని సతమణి రితికా సజ్దే ఫ్రాంచైజీ తీరును తప్పుబట్టింది. ఇక యువరాజ్ సింగ్ సైతం ఫ్రాంచైజీ నిర్ణయాన్ని విమర్శించాడు. ఐదు సార్లు టైటిల్ అందించిన సారథిని పక్కనపెట్టడం చాలా పెద్ద నిర్ణయమన్నాడు.

'రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచాడు. అతన్ని సారథ్య బాధ్యతల నుంచి తప్పించడం చాలా పెద్ద నిర్ణయం. అతని స్థానాన్ని భర్తీ చేయడానికి హార్దిక్ పాండ్యాను జట్టులోకి తీసుకొచ్చారు. కానీ నా అభిప్రాయం ప్రకారం మరో సీజన్ వరకు రోహిత్ శర్మను కెప్టెన్‌గా కొనసాగించాల్సింది. అతనికి డిప్యూటీగా హార్దిక్ పాండ్యాను నియమించి జట్టు ఆట తీరును పరిశీలించాల్సింది.

ఫ్రాంచైజీ పాయింట్ ఆఫ్ వ్యూను నేను అర్థం చేసుకోగలను. వాళ్లు ఫ్రాంచైజీ భవిష్యత్తును దృష్టి‌లో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. అద్భుత ప్రదర్శనతో అద్భుత విజయాలు అందిస్తున్నాడు. కాబట్టి కెప్టెన్సీ మార్పు అనేది చాలా పెద్ద నిర్ణయమే.

అయితే గుజరాత్ టైటాన్స్ జట్టుకు ముంబై ఇండియన్స్‌కు చాలా తేడా ఉంది. కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాకు ముంబై ఇండియన్స్‌ను నడిపించడం అంత సులువైన పని కాదు. టాలెంట్ విషయంలో హార్దిక్ పాండ్యాకు డోకా లేదు. ముంబై ఇండియన్స్ సారథ్యం మాత్రం సవాల్‌గా ఉంటుంది. అభిమానుల అంచనాలు చాలా ఉంటాయి. ఎందుకంటే ముంబై చాలా పెద్ద జట్టు.'అని యువరాజ్ సింగ్ చెప్పుకొచ్చాడు.

Story first published: Thursday, March 14, 2024, 11:29 [IST]
Other articles published on Mar 14, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+