For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2024: రూ. 5 కోట్లు దండుగ అన్నారు.. యశ్ దయాల్ తండ్రి భావోద్వేగం!

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) స్టార్ పేసర్ యశ్ దయాల్ సంచలన ప్రదర్శనతో అతని తండ్రి చంద్రపాల్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. తన కొడుకును ఆర్‌సీబీ కొనుగోలు చేయడాన్ని చాలా మంది తప్పుబట్టారని, అతనికి రూ. 5 కోట్లు దండుగ అన్నారని గుర్తు చేసుకున్నాడు. తన కొడుకుపై వచ్చిన విమర్శలను చూడలేక తమ కుటుంబం మొత్తం సోషల్ మీడియాకు దూరంగా ఉందని చెప్పాడు.

ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌ బౌలింగ్ చేసిన యశ్ దయాల్.. 17 పరుగులు డిఫెండ్ చేసి ఆర్‌సీబీని ప్లే ఆఫ్స్ చేర్చాడు. తొలి బంతికి ధోనీ సిక్స్ కొట్టినా.. ఏమాత్రం బెదరకుండా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి మొత్తం ఏడు పరుగులే ఇచ్చి సంచలన విజయాన్ని అందించాడు.

IPL 2024 Yash Dayal s father recalls facing trolls after son s RCB selection

రూ. 5 కోట్లు దండుగ..
ఈ ప్రదర్శనతో యశ్ దయాల్‌పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. గతేడాది గుజరాత్ టైటాన్స్ తరఫున ఇదే యశ్ దయాల్ ఆఖరి ఓవర్‌లో రింకూ సింగ్ ధాటికి వరుసగా 5 సిక్స్‌లు సమర్పించుకొని తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. తీవ్ర మానసిక వేదనతో అనారోగ్యానికి గురవ్వడంతో పాటు ఆటకు దూరమయ్యాడు.

ఈ సీజన్ వేలానికి అతన్ని గుజరాత్ టైటాన్స్ వదిలేయగా.. ఆర్‌సీబీ రూ. 5 కోట్ల భారీ ధర పెట్టి కొనుగోలు చేసింది. ఈ నిర్ణయాన్ని చాలా మంది తప్పుబట్టారు. యశ్ దయాల్‌కు రూ. 5 కోట్లు అవసరమా? అని విమర్శలు గుప్పించారు. కానీ తనపై ఆర్‌సీబీ పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా యశ్ దయాల్ అద్భుత ప్రదర్శనతో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.

వాట్సాప్ గ్రూప్స్ నుంచి తప్పుకున్నా..
తన కొడుకు సంచలన ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేసిన యశ్ దయాల్ తండ్రి.. అతని వచ్చిన విమర్శలు గుర్తు చేసుకొని భావోద్వేగానికి గురయ్యాడు. 'నేను ఉన్న ఒక వాట్సాప్ గ్రూప్‌లో ఓ వ్యక్తి ఒక మీమ్ షేర్ చేశాడు. యశ్ దయాల్‌ ఇచ్చిన ఐదు సిక్సర్లను ప్రస్తావిస్తూ అతన్ని ఎగతాళి చేసిన ఆ వ్యాఖ్యలు ఇప్పటికి నాకు గుర్తున్నాయి.

ఆ మీమ్‌లో 'ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ కథ ప్రారంభం కాకముందే ముగిసింది'అని రాసుకొచ్చారు. అప్పటి నుంచి ఇలాంటి మీమ్స్ ఆగలేదు. వీటి బాధ భరించలేక మేం మా ఫ్యామిలీ గ్రూప్ మినహా అన్ని వాట్సాప్ గ్రూప్‌ల్లో నుంచి నిష్క్రమించాం. యశ్ దయాల్‌ను ఆర్‌సీబీ కొనుగోలు చేసినప్పుడు కూడా ఇలాంటి విమర్శలే వచ్చాయి.

ఆర్‌సీబీ తమ రూ. 5 కోట్ల డబ్బును బురదలో వేసిందని ట్రోల్ చేశారు. సోషల్ మీడియాకు దూరంగా ఉన్నా ఇలాంటి మీమ్స్ మమ్మల్ని వెంటాడాయి.'అని యశ్ దయాల్ తండ్రి ఓ జాతీయ చానెల్‌తో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యాడు.

Story first published: Monday, May 20, 2024, 12:44 [IST]
Other articles published on May 20, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+