Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2024: చెన్నై జట్టులో చీలిక? స్టార్ ఆల్‌రౌండర్‌ను పట్టించుకోని ధోనీ, రుతురాజ్ గైక్వాడ్!

ఐపీఎల్ 2024 సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్.. గెలుపుతో ఈ టోర్నీని ఆరంభించినా వరుస పరాజయాలతో తీవ్రంగా నిరాశ పరిచింది. ఇప్పటి వరకు జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లో రెండింటిలో మాత్రమే విజయం సాధించింది. అవి కూడా సొంతగడ్డపై జరిగిన మ్యాచ్‌ల్లోనే గెలుపొందింది.

ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ 4 పాయింట్లతో పాయింట్స్ టేబుల్‌లో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. సొంతగడ్డపై మరికాసేపట్లో ప్రారంభమయ్యే మ్యాచ్‌లో పటిష్టమైన కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే చెన్నై సూపర్ కింగ్స్ మూడో స్థానానికి చేరనుంది. ఓడితే మాత్రం ఐదో స్థానానికి పడిపోనుంది.

IPL 2024 Why Shardul Thakur is not playing for CSK Rift with Ruturaj Gaikwad

చెన్నై జట్టులో చీలిక..?
మరోవైపు హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్న కోల్‌కతా నైట్‌రైడర్స్ ఓటమెరుగని జట్టుగా రెండో స్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్ విజయం సాధిస్తే ఆ జట్టు టేబుల్ టాపర్‌గా నిలవనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో విభేదాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. స్టార్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌కు గత నాలుగు మ్యాచ్‌ల్లో చోటు దక్కలేదు.

సూపర్ ఫామ్‌లో ఉన్నా..
ప్రస్తుతం శార్దూల్ ఠాకూర్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఈ సీజన్ రంజీ ట్రోఫీలో అతను ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ముంబై జట్టు ఛాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు.

బ్యాటింగ్, బౌలింగ్‌లో సత్తా చాటాడు. అలాంటి ఆటగాడిని చెన్నై సూపర్ కింగ్స్ పట్టించుకోకపోవడం అందర్నీ విస్మయ పరుస్తోంది. కనీసం అతన్ని ఇంపాక్ట్ ప్లేయర్‌గా కూడా పరిగణలోకి తీసుకోకపోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.

IPL 2024 Why Shardul Thakur is not playing for CSK Rift with Ruturaj Gaikwad

కెప్టెన్‌తో గొడవ..
మరీ ముఖ్యంగా జట్టులోని భారత పేసర్లు అంతా దారుణంగా విఫలమవుతున్నా.. శార్దూల్ ఠాకూర్‌ను పట్టించుకోకపోవడంపై ఆ జట్టు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీపక్ చాహర్, ముఖేశ్ చౌదరి, తుషార్ దేశ్‌పాండే దారుణంగా విఫలమవుతున్నా.. వారినే కొనసాగించడాన్ని సీఎస్‌కే అభిమానులు తప్పుబడుతున్నారు.

కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌తో శార్దూల్ ఠాకూర్‌కు విభేదాలు ఉన్నాయని, అవే అతనికి అవకాశం ఇవ్వకుండా చేస్తున్నాయని సోషల్ మీడియా వేదికగా ఆరోపిస్తున్నారు. శార్దూల్ ఠాకూర్‌తో పాటు చెన్నై బెంచ్‌లో రాజవర్దన్ హంగార్గేకర్, నిశాంత్ సిద్దూ వంటి ఆటగాళ్లను కూడా పట్టించుకోవడం లేదని కామెంట్ చేస్తున్నారు.

దీపక్ చాహర్ వల్లనే..
శార్దూల్ ఠాకూర్‌ను జట్టులోకి తీసుకుంటే జట్టు బౌలింగ్‌తో పాటు లోయరార్డర్ బ్యాటింగ్ కూడా పటిష్టం అవుతుందని అభిప్రాయపడుతున్నారు. అయితే శార్దూల్ ఠాకూర్ శైలిలోనే బౌలింగ్ చేసే దీపక్ చాహర్ జట్టు ఉండటంతో శార్దూల్‌కు చోటు లేకుండా చేస్తోంది. శివమ్ దూబేను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడిస్తుండటంతో శార్దూల్ ఠాకూర్‌కు ఆ అవకాశం కూడా లేకపోయింది.

Story first published: Monday, April 8, 2024, 17:15 [IST]
Other articles published on Apr 8, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+