Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2024: అందుకే వైజాగ్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు!

ఐపీఎల్ 2024 సీజన్‌లో విశాఖపట్నంలోని వైఎస్‌ రాజశేఖర రెడ్డి స్టేడియం రెండు మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది. వైజాగ్ బేస్డ్ ఫ్రాంచైజీ లేకపోయినా.. ఢిల్లీ క్యాపిటల్స్ తమ తొలి రెండు హోమ్ మ్యాచ్‌లను సాగర తీరాన ఆడాలని నిర్ణయించుకుంది. ఐపీఎల్ 2024 షెడ్యూల్‌ను బీసీసీఐ గురువారం ప్రకటించింది.

ఎన్నికల నేపథ్యంలో ముందుగా 21 మ్యాచ్‌ల వివరాలను మాత్రమే వెల్లడించింది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత మిగతా 52 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ప్రకటించనుంది. మార్చి 22న ఈ క్యాష్ రిచ్ లీగ్‌కు తెరలేవనుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అమీతుమీ తేల్చుకోనున్నాయి.

 IPL 2024: Why Delhi Capitals are playing their home games in Vizag

ఈ ఫస్టాఫ్ షెడ్యూల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఐదు మ్యాచ్‌లు ఆడనుంది. ఇందులోని తమ హోమ్ గ్రౌండ్ మ్యాచ్‌లను ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానం కాకుండా.. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖను ఎంచుకుంది. అయితే వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) ఎలిమినేటర్‌తో పాటు ఫైనల్ మ్యాచ్‌లు ఢిల్లీ వేదికగా జరగనున్నాయి.

ఐపీఎల్ ప్రారంభానికి ముందు అరుణ్ జైట్లీ మైదానం వేదికగా 11 డబ్ల్యూపీఎల్ మ్యాచ్‌లు షెడ్యూల్ చేశారు. వరుస మ్యాచ్‌ల కారణంగా పిచ్‌లో జీవం పోయే అవకాశం ఉండటంతో ఢిల్లీ మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. తమ హోమ్ మ్యాచ్‌లను విశాఖకు తరలించింది. మార్చి 31న చెన్నై సూపర్ కింగ్స్, ఏప్రిల్ 3న కేకేఆర్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ విశాఖ వేదికగా ఆడనుంది.

ఇక తమ తొలి మ్యాచ్‌ను మార్చి 23న ఆడనుంది. మొహాలీ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ తమ క్యాంపైన్ ప్రారంభించనుంది. మార్చి 28న జైపూర్‌లో రాస్థాన్ రాయల్స్‌తో, మార్చి 31న విశాఖ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో.. ఏప్రిల్ 3న విశాఖ వేదికగా కేకేఆర్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది.

Story first published: Thursday, February 22, 2024, 21:41 [IST]
Other articles published on Feb 22, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+