For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Abishek Porel: ఎవడ్రా వీడు మరి ఇంత టాలెంటెడ్‌గా ఉన్నాడు!

అభిషేక్ పోరెల్.. ప్రస్తుతం భారత క్రికెట్‌లో మారుమోగుతున్న పేరు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఈ 21 ఏళ్ల కుర్రాడు విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. ఇన్నింగ్స్ చివర్లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగి తన సంచలన బ్యాటింగ్‌తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు.

పంజాబ్ కింగ్స్ పేసర్ హర్షల్ పటేల్‌కు మరో పీడ కలను మిగిల్చాడు. అతను వేసిన ఆఖరి ఓవర్‌లో వరుసగా 4, 6, 4, 4, 6, 1 ఐదు బౌండరీలు బాది 25 పరుగులు పిండుకున్నాడు. అభిషేక్ పోరెల్ సెన్సేషనల్ బ్యాటింగ్‌తో ఢిల్లీ 175 పరుగుల పోరాడే లక్ష్యాన్ని అందుకుంది. దాంతో ఏకపక్షంగా సాగుతుందనుకున్న ఈ మ్యాచ్ రసవత్తరంగా మారింది.

IPL 2024 Who is Abishek Porel You Need to Know About Delhi Capitals Impact Player

ఈ సంచలన ఇన్నింగ్స్‌తో అభిషేక్ పోరెల్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచాడు. ఏ సోషల్ మీడియా వేదికను కదిలించినా అతని సెన్సేషన్ బ్యాటింగ్ గురించే చర్చ జరుగుతోంది. దాంతో క్రికెట్ ప్రేమికులు ఈ 21 ఏళ్ల కుర్రాడి గురించి తెలుసుకునేందుకు తెగ ఆసక్తికనబరుసున్నారు. అతని పుట్టు పూర్వాలు తెలుసుకునేందుకు గూగుల్‌ను ఆశ్రయిస్తున్నారు.

ఎవరీ అభిషేక్ పోరెల్..?
అభిషేక్ పోరెల్.. వెస్ట్ బెంగాల్‌లోని చందన్ నగర్‌లో 2003లో జన్మించాడు. డొమెస్టిక్ క్రికెట్‌లో బెంగాల్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. రెండేళ్ల క్రితం బరోడాతో జరిగిన మ్యాచ్‌తో దేశవాళీ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ అయిన అభిషేక్ పోరెల్.. విధ్వంసకర హిట్టర్. చివర్లో వచ్చి మెరుపులు మెరిపించడం అతని నైజం.

ఇప్పటి వరకు 23 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అభిషేక్ పోరెల్ 1072 రన్స్ చేశాడు. వికెట్ కీపర్‌గా 58 క్యాచ్‌లతో పాటు 8 స్టంపౌట్స్ చేశాడు. 14 లిస్ట్ ఏ మ్యాచ్‌ల్లో 275 పరుగులు చేశాడు. 15 టీ20ల్లో 228 రన్స్ చేశాడు. గతేడాదే ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేసిన అభిషేక్ పోరెల్.. బ్యాటింగ్‌లో పెద్దగా ఆకట్టుకోలేదు.

పంత్‌కు రిప్లేస్‌మెంట్‌గా వచ్చి..
రోడ్డు ప్రమాదంలో రిషభ్ పంత్ తీవ్రంగా గాయపడటంతో ఢిల్లీ క్యాపిటల్స్ అతనికి రిప్లేస్‌మెంట్‌గా రూ. 20 లక్షల కనీస ధరకు అభిషేక్ పోరెల్‌ను తీసుకుంది. గత సీజన్‌లో బ్యాటింగ్‌లో విఫలమైనా.. వికెట్ కీపర్‌గా అభిషేక్ పోరెల్ పర్వాలేదనిపించాడు. రిషభ్ పంత్ అందుబాటులోకి వచ్చినా అతన్ని రిటైన్ చేసుకుంది.

పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో తుది జట్టులో చోటు దక్కకపోయినా.. క్లిష్ట పరిస్థితుల్లో అతనిపై నమ్మకం ఉంచి ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దించింది. ఈ అవకాశాన్ని అభిషేక్ పోరెల్ రెండు చేతులతో అందింపుచ్చుకున్నాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో అందరూ గుర్తుంచుకునే ఇన్నింగ్స్ ఆడాడు. దాంతో అభిషేక్ పోరెల్‌పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. 'ఎవడ్రా వీడు మరి ఇంత టాలెంటెడ్‌గా ఉన్నాడు'అనే మీమ్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

Story first published: Saturday, March 23, 2024, 18:56 [IST]
Other articles published on Mar 23, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+