Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2024: హార్దిక్ పాండ్యా విషయంలో ముంబై ఇండియన్స్ తప్పులేదు! క్యాష్ డీల్ రూల్స్ ఏంటంటే..?

IPL 2024 Auction: ఐపీఎల్ 2024 మినీ వేలం నేపథ్యంలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా జట్టు మారడం తీవ్ర చర్చనీయాంశమైంది. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా ఉన్న హార్దిక్ పాండ్యా.. క్యాష్ ట్రేడింగ్ డీల్ ద్వారా తన పాత జట్టు ముంబై ఇండియన్స్ గూటికి చేరాడు. పూర్తిగా క్యాష్ డీల్ ప్రకారం ఈ ట్రేడింగ్ జరగడం అనేక అనుమానాలకు తావిచ్చింది.

గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా అరంగేట్ర సీజన్‌లోనే టైటిల్ అందించడంతో పాటు మరుసటి సీజన్‌లో రన్నరప్‌గా నిలబెట్టిన హార్దిక్ పాండ్యాను ఆ జట్టు ఎందుకు వదులుకుందా? అనే ప్రశ్న ఉత్పన్నమైంది. ఈ డీల్ వెనుక ముంబై ఇండియన్స్ భారీ డబ్బును ఏమైనా ఆఫర్ చేసిందా? లేక లండన్ బేస్డ్ కంపెనీ అయిన గుజరాత్ టైటాన్స్ ఓనర్స్ సీవీసీ క్యాపిటల్స్‌ను బెదిరించిందా? అనే ఆరోపణలు సోషల్ మీడియా వేదికగా గత రెండు రోజులుగా హల్‌చల్ చేశాయి.

 IPL 2024: What is a one-way trade? How Hardik Pandya all-cash deal work ?

క్యాష్ డీల్ ట్రేడింగ్ అంటే..?
అయితే ఐపీఎల్ 2023 రూల్స్ ప్రకారమే హార్దిక్ పాండ్యా క్యాష్ ట్రేడింగ్ డీల్ జరిగినట్లు అర్థమవుతోంది. ఐపీఎల్ ప్లేయర్ ట్రేడ్ రూల్స్ ప్రకారం ఇరు జట్లు పరస్పర అంగీకారంతో ఆటగాళ్లను స్వాప్ చేసుకోవచ్చు. లేదంటే క్యాష్ డీల్ ద్వారా మార్చుకోవచ్చు. ఐపీఎల్ 2009 నుంచి ఈ రూల్‌ను ప్రవేశపెట్టారు. క్యాష్ డీల్ అంటే సదరు ఆటగాడికి పాత ఫ్రాంచైజీ ఇచ్చే డబ్బులతో ట్రాన్సఫర్ ఫీజును చెల్లించాలి.

ట్రాన్సఫర్ ఫీజు ఎంత అమౌంట్ అనేది ఇరు ఫ్రాంచైజీల పరస్పర అంగీకారంపై ఆధారపడి ఉంటుంది. ఈ అమౌంట్‌పై ఎలాంటి పరిమితి లేదు. టీమ్ పర్స్ వాల్యూపై కూడా దీని ప్రభావం ఉండదు. ఆ అమౌంట్ ఎంతా? అనేది ఐపీఎల్ నిర్వహకులతో ఇరు ఫ్రాంచైజీలకు మాత్రమే తెలుస్తోంది.

ఈ ట్రాన్స్‌ఫర్ ఫీజులో 50 శాతం సదరు ఆటగాడికి చెల్లించాలి. కానీ ఇది కూడా ఇరు ఫ్రాంచైజీల ఒప్పందంపైనే ఆధారపడి ఉంటుంది. ట్రాన్సఫర్ ఫీజులో 50 శాతం సదరు ప్లేయర్‌కు చెల్లిస్తారా? అనేది కచ్చితంగా చెప్పలేం.

ప్లేయర్ ఇష్టమే.. ఫ్రాంచైజీదే తుది నిర్ణయం..
ట్రేడింగ్ విషయంలో ఆటగాడి అభిప్రాయం తీసుకోవాల్సి ఉంటుంది. ట్రేండింగ్ విషయం‌లో ప్లేయర్స్ ఇన్షియేట్ తీసుకోవచ్చు. క్యాష్ ట్రేడ్ విషయంలో పాత ఫ్రాంచైజీ తీసుకున్నదే తుది నిర్ణయం. తమ ఆటగాడిని వదులుకోవడం ఆ జట్టుకు ఇష్టం లేదంటే అతనికి ఇష్టం లేకపోయినా అదే జట్టులో కొనసాగాలి.

ఈ రూల్ ప్రకారమే ఐపీఎల్ 2023 సీజన్ ముగిసిన వెంటనే హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ జట్టులోకి రావాలని ఉందని సమాచారమిచ్చారు. వాళ్లు క్యాష్ ట్రేడింగ్, ప్లేయర్స్ స్వాపింగ్ ద్వారా హార్దిక్ పాండ్యాను తీసుకునేందుకు సిద్దమయ్యారు. చివరకు గుజరాత్ టైటాన్స్ క్యాష్ డీల్‌కు ఒప్పుకోవడంతో హార్దిక్ పాండ్యా ప్రైజ్ రూ.15 కోట్లు చెల్లించడంతో పాటు ట్రాన్సఫర్ ఫీజును కూడా చెల్లించారు.

ఈ ట్రాన్స్‌ఫర్ ఫీజులో 50 శాతం హార్దిక్ పాండ్యాకు కూడా ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి.

అందుకే జడేజాపై నిషేధం..
రవీంద్ర జడేజా మరో ఫ్రాంచైజీతో సంప్రదింపు జరిపితేనే నిషేధం విధించారా? కదా? అనే సందేహం కలగవచ్చు. కానీ జడేజా ఐపీఎల్ 2010 సీజన్‌కు ముందు రాజస్థాన్ రాయల్స్‌ కాంట్రాక్ట్‌పై సంతకం చేయకుండా.. ముంబై ఇండియన్స్‌లోకి వెళ్లేందుకు సంప్రదింపులు జరిపాడు. ఇది నిబంధనలకు విరుద్దం కావడంతో అతనిపై నిషేధం విధించారు. కానీ హార్దిక్ పాండ్యా.. రూల్స్ ప్రకారం ఇరు జట్ల పరస్పర అంగీకారంతోనే మారాడు.

Story first published: Tuesday, November 28, 2023, 18:14 [IST]
Other articles published on Nov 28, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+