Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2024: లైట్ తీస్కో హార్దిక్.. రోహిత్ కూడా టైటిల్ గెలవలేదు: వీరేంద్ర సెహ్వాగ్

ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక సలహా ఇచ్చాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఎలాంటి ఒత్తిడికి గురి కావాల్సిన అవసరం లేదని, వ్యక్తిగతంగా మెరుగైన ప్రదర్శన చేసేందుకు ప్రయత్నించాలని సూచించాడు. రోహిత్ శర్మ కూడా గత మూడు సీజన్లలో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా విఫలమయ్యాడని గుర్తు చేశాడు.

ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. 8 మ్యాచ్‌ల్లో ఆ జట్టు ఐదింటిలో ఓట
మిపాలైంది. రోహిత్ శర్మను తప్పించి హార్దిక్ పాండ్యాకు సారథ్య బాధ్యతలు అప్పగించగా.. అతని కెప్టెన్సీపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అతని చెత్త కెప్టెన్సీ ఇలానే కొనసాగితే ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ కూడా చేరదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

IPL 2024 Virender Sehwag backs Hardik Pandya says MI lost 5 successive matches under Rohit Sharma

ఈ క్రమంలోనే హార్దిక్ పాండ్యాకు వీరేంద్ర సెహ్వాగ్ అండగా నిలిచాడు. గత మూడు సీజన్లలో రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్‌ను విజేతగా నిలపలేదని, విమర్శలను పట్టించుకోకుండా హార్దిక్ తన వ్యక్తిగత ప్రదర్శనపై ఫోకస్ పెట్టాలని సూచించాడు.

'బ్యాటర్‌గా, బౌలర్‌గా హార్దిక్ పాండ్యాపై ఒత్తిడి ఎక్కువగా ఉందని నేను అనుకోవడం లేదు. అతనే ఎక్కువగా ఊహించుకుంటున్నాడేమోనని అనిపిస్తోంది. రోహిత్ శర్మ నుంచి సారథ్య బాధ్యతలను చేపట్టిన హార్దిక్ పాండ్యాపై భారీ అంచనాలు ఉండటం సహజమే. కానీ ముంబైకి ఇలాంటి పరిస్థితి గత రెండు సీజన్ల నుంచి ఉంది.

రోహిత్ శర్మ కూడా కెప్టెన్‌గా పరుగులు చేయలేకపోయాడు. ఇటీవల అతను టైటిల్ గెలిచింది కూడా లేదు. కాబట్టి, పాండ్యా కూడా ఎలాంటి ఒత్తిడికి గురికానక్కర్లేదు. జట్టుగా ఆడితేనే ముంబైకి గెలుస్తోంది. ముంబై విజేతగా నిలవాలంటే ముందు హార్దిక్ పాండ్యా తన వ్యక్తిగత ప్రదర్శనను మెరుగుపర్చుకోవాలి. కెప్టెన్సీలో విజయాలు దక్కకపోవడంతో అదనపు ఒత్దిడిగా భావిస్తున్నాడు.

అతను అప్‌ది ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయాలి. లోయరార్డర్‌లో ఆడుతున్నప్పుడు ఎక్కువ బంతులు ఎదుర్కోవడం సాధ్యం కాదు. అందుకే తనకు తానే అవకాశం సృష్టించుకోవాలి. ముందుగా బ్యాటింగ్ బాగా చేస్తే ఆటోమెటిక్‌గా బౌలింగ్‌తో పాటు కెప్టెన్సీలోనూ మెరుగుదల కనిపిస్తోంది.'అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.

Story first published: Wednesday, April 24, 2024, 19:16 [IST]
Other articles published on Apr 24, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+