Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2024: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. సురేశ్ రైనా రికార్డ్ బద్దలు!

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. పురుషుల టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న తొలి భారత ప్లేయర్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ ఈ ఘనతను అందుకున్నాడు.

మహమ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో జానీ బెయిర్ స్టో ఇచ్చిన క్యాచ్‌ను అందుకోవడం ద్వారా కోహ్లీ ఈ ఫీట్ సాధించాడు. ఈ క్రమంలో సురేశ్ రైనా పేరిట ఉన్న ఈ రికార్డును కోహ్లీ అధిగమించాడు. ఈ మ్యాచ్‌లో శిఖర్ ధావన్ క్యాచ్‌ను కూడా అందుకున్న కోహ్లీ.. టీ20 క్రికెట్‌లో ఇప్పటి వరకు 174 క్యాచ్‌లు అందుకున్నాడు.

IPL 2024 Virat Kohli becomes Most catches by Indian fielder in T20 cricket history

ఈ జాబితాలో కోహ్లీ తర్వాత సురేశ్ రైనా(172), రోహిత్ శర్మ(167), మనీష్ పాండే(146), సూర్యకుమార్ యాదవ్(136) క్యాచ్‌లతో తర్వాతి స్థానంలో ఉన్నారు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు చేసింది.

శిఖర్ ధావన్(37 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 45), ప్రభ్‌సిమ్రాన్ సింగ్(17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 25), జితేశ్ శర్మ(20 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 27) టాప్ స్కోరర్లుగా నిలిచారు. చివర్లో శశాంక్ సింగ్(8 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 21 నాటౌట్) ధాటిగా ఆడాడు. ఆర్‌సీబీ బౌలర్లలో మహమ్మద్ సిరాజ్, గ్లేన్ మ్యాక్స్‌వెల్ రెండేసి వికెట్లు తీయగా.. యశ్ దయాల్, అల్జారీ జోసెఫ్ తలో వికెట్ తీసారు.

Story first published: Monday, March 25, 2024, 22:07 [IST]
Other articles published on Mar 25, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+