Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2024: కాకా! రీ ఎంట్రీ ఇవ్వు.. నీ కోసమే ఆ రూల్! క్రిస్ గేల్‌కు కోహ్లీ ఆఫర్!(వీడియో)

యూనీవర్సల్ బాస్, వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ క్రిస్ గేల్‌కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. వచ్చే సీజన్‌లో ఆర్‌సీబీ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వాలని కోరాడు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్.. వెటరన్ ప్లేయర్ల కోసమే తెచ్చారని, ఫీల్డింగ్ చేయకున్నా బ్యాటింగ్ చేస్తే సరిపోతుందని చెప్పాడు.

ఐపీఎల్ 2024 సీజన్‌లో ప్లే ఆఫ్స్ చేరిన తర్వాత ఆర్‌సీబీ డ్రెస్సింగ్ రూమ్‌కు వచ్చిన క్రిస్ గేల్‌తో కోహ్లీ సరదాగా అన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్లే ఆఫ్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ దుమ్మురేపింది.

IPL 2024 Virat Kohli Asks Chris Gayle to Kaka Comeback next year Impact player is on now

చెన్నై సూపర్ కింగ్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో అసాధారణ ప్రదర్శనతో 27 పరుగులతో గెలిచిన ఆర్‌సీబీ.. మెరుగైన రన్‌రేట్‌తో ప్లే ఆఫ్స్ చేరింది. సీఎస్‌కేను 20 ప్లస్ రన్స్‌తో ఓడించాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీ.. యశ్ దయాల్ సంచలన బౌలింగ్‌తో ఆశించిన ఫలితాన్ని అందుకుంది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ధోనీ, జడేజా చివరి వరకు పోరాడినా.. ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయింది.

ఈ సీజన్‌లో ఆర్‌సీబీ అద్భుతంగా పుంజుకుంది. తొలి 8 మ్యాచ్‌ల్లో ఒకే ఒక్క విజయం సాధించిన ఆ జట్టు.. సెకండాఫ్‌లో వరుసగా 6 మ్యాచ్‌లు గెలిచి అనూహ్య పరిస్థితుల్లో ప్లే ఆఫ్స్ చేరింది. దాంతోనే ఆర్‌సీబీ ఆటగాళ్లు టైటిల్ గెలిచినంత సంబరాలు చేసుకున్నారు. బెంగళూరు వేదికగా జరిగిన ఈ కీలక మ్యాచ్‌కు క్రిస్ గేల్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.

మ్యాచ్ ఆసాంతం ఆర్‌సీబీకి మద్దతు తెలిపాడు. విజయానంతరం డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లి ఆర్‌సీబీ ఆటగాళ్లతో సరదా గడిపి పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నాడు. క్రిస్ గేల్ డ్రెస్సింగ్ రూమ్‌లో రావడం చూసి కోహ్లీ తనదైన శైలిలో కామెంట్రీ చెప్పాడు. 'యూనివర్సల్ బాస్ తన రాజ్యంలోకి అడుగు పెట్టాడు. ఈ సీజన్‌లో 37 సిక్స్‌లు కొట్టాను. కాకా వచ్చే ఏడాది రీఎంట్రీ ఇవ్వు. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఉంది. నువ్వు ఫీల్డింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ రూల్ నీకోసమే రూపొందించారు.'అని కోహ్లీ తెలిపాడు.

చాలా సేపు ఆర్‌సీబీ ఆటగాళ్లతో సరదాగా గడిపిన క్రిస్ గేల్‌కు ప్లేయర్ల సంతకాలతో కూడిన విరాట్ కోహ్లీ జెర్సీని బహుమతిగా అందజేశారు. ఈ వీడియోను ఆర్‌సీబీ అభిమానులతో పంచుకుంది.

Story first published: Monday, May 20, 2024, 10:58 [IST]
Other articles published on May 20, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+