Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2024: ఈ అన్‌సోల్డ్ ఆటగాళ్లకు లక్కీ ఛాన్స్..!

ఐపీఎల్ 2024 సీజన్‌‌కు రంగం సిద్దమైంది. మరో 9 రోజుల్లో ఈ క్యాష్ రిచ్ లీగ్‌కు తెరలేవనుంది. చెన్నై వేదికగా జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌ చెన్నై సూపర్ కింగ్స్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) జట్లు తలపడనున్నాయి. దేశంలో సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో బీసీసీఐ.. 22 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను మాత్రమే ప్రకటించింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వెంటనే.. మిగతా మ్యాచ్‌ల వివరాలను ప్రకటించనుంది.

ఇప్పటికే దేశవ్యాప్తంగా ఐపీఎల్ సందడి మొదలైంది. 10 ఫ్రాంచైజీలు తమ సన్నాహకాలను ప్రారంభించాయి. ప్రీ ట్రైనింగ్ క్యాంప్‌లతో జట్లను రెడీ చేస్తున్నాయి. వ్యక్తిగత కారణాలు, గాయాలతో కొంతమంది ఆటగాళ్లు ఈ సీజన్‌ ప్రారంభానికి ముందే తమ జట్లకు దూరమయ్యారు.

IPL 2024 Unsold Players Who Can Join IPL Teams as Replacements

ఇలా జట్టుకు దూరమైన ఆటగాళ్ల స్థానాలను భర్తీ చేసేందుకు ఫ్రాంచైజీలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. దాంతో దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2024 మినీ వేలంలో అమ్ముడుపోని ఆటగాళ్లకు మరో అవకాశం దక్కనుంది. ఐపీఎల్ 2024 మినీ వేలం తర్వాత సంచలన ప్రదర్శన కనబర్చిన ఓ నలుగురు ఆటగాళ్లను తీసుకునేందుకు ఫ్రాంచైజీలు తెగ ఆసక్తి కనబరుస్తున్నాయి. ఆ ఆటగాళ్లపై ఓ లుక్కెద్దాం.

IPL 2024 Unsold Players Who Can Join IPL Teams as Replacements

సర్ఫరాజ్ ఖాన్..
టీమిండియా యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్‌ను ఐపీఎల్ 2024 మినీ వేలంలో ఏ ఫ్రాంచైజీ పట్టించుకోలేదు. గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడిన అతను తీవ్రంగా నిరాశపర్చడంతో ఆ జట్టు వదిలేసింది. వేలంలో ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపించకపోవడంతో అన్‌సోల్డ్‌గా నిలిచిపోయాడు. అయితే ఇటీవల ఇంగ్లండ్‌తో ముగిసిన టెస్ట్ సిరీస్‌లోకి అరంగేట్రం చేసి సర్ఫరాజ్ ఖాన్ సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. దూకుడైన బ్యాటింగ్‌తో మూడు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. దాంతో అతనిపై ఫ్రాంచైజీలు ఫోకస్ పెట్టాయి.

IPL 2024 Unsold Players Who Can Join IPL Teams as Replacements

ముషీర్ ఖాన్..
సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు, అండర్ 19 సెన్సేషన్ ముషీర్ ఖాన్‌ను కూడా వేలంలో ఏ జట్టు పట్టించుకోలేదు. అతని గురించి పెద్దగా ఎవరికి తెలియకపోవడంతో ఆసక్తి చూపించలేదు. కానీ అండర్ 19 ప్రపంచకప్‌లో సెంచరీల మోత మోగించిన అతను.. రంజీ ట్రోఫీలోనూ అదే జోరు కొనసాగించాడు. దాంతో అతన్ని తీసుకునేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి కనబరుస్తున్నాయి.

IPL 2024 Unsold Players Who Can Join IPL Teams as Replacements

ఓలీ రాబిన్సన్..
ఇంగ్లండ్ పేసర్ ఓలీ రాబిన్సన్ కూడా ఫ్రాంచైజీలు కొనుగోలు చేయలేదు. అయితే మహమ్మద్ షమీ, ప్రసిధ్ కృష్ణ వంటి ఆటగాళ్లు దూరమవడంతో వారి స్థానాల్లో ఓలీ రాబిన్సన్‌ను తీసుకునేందుకు ఆయా ఫ్రాంచైజీలు ఆసక్తికనబరుస్తున్నాయి. రాబిన్సన్‌కు టీ20ల్లో మెరుగైన రికార్డు ఉంది. 49 మ్యాచ్‌ల్లో 45 వికెట్లు తీసాడు.

కుశాల్ మెండీస్..
శ్రీలంక ప్లేయర్ కుశాల్ మెండీస్ సైతం ఐపీఎల్ 2024 సీజన్‌లో అన్ సోల్డ్‌గా నిలిచాడు. ఇటీవల జరిగిన అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో కుశాల్ మెండీస్ అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. దాంతో అతనిపై ఫ్రాంచైజీలు ఫోకస్ పెట్టాయి.

Story first published: Wednesday, March 13, 2024, 16:37 [IST]
Other articles published on Mar 13, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+