Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH vs MI: ట్రావిస్ హెడ్ విధ్వంసం.. చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్ హైదరాబాద్

ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో ఉప్పల్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్(24 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 62) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేసిన ట్రావిస్ హెడ్.. సన్‌రైజర్స్ తరఫున అత్యంత వేగంగా 50 పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు.

ఇదే మ్యాచ్‌లో సన్‌రైజర్స్ యువ బ్యాటర్ అభిషేక్ శర్మ 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేసి ట్రావిస్ హెడ్‌ను వెనక్కినెట్టాడు. ఈ ఇద్దరూ సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ రికార్డును అధిగమించాడు. సన్‌రైజర్స్ తరఫున డేవిడ్ వార్నర్.. 20 బంతుల్లో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.

IPL 2024 Travis Head smashes fastest fifty as SRH Scored Best Powerplay in the IPL history

ఓవరాల్‌గా ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ నమోదు చేసిన నాలుగో బ్యాటర్‌గా ట్రావిస్ హెడ్ నిలిచాడు. ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ పేరిటనే ఉండటం విశేషం.

ఐపీఎల్ 2022 సీజన్‌లో అతను కేకేఆర్ తరఫున 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అతని తర్వాత అభిషేక్ శర్మ 16 బంతుల్లోనే ఈ ఫీట్ సాధించి రిషభ్ పంత్(18), ట్రావిస్ హెడ్(18)లను వెనక్కినెట్టాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున రిషభ్ పంత్ 2018లో 18 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు.

అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ విధ్వంసంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ పవర్ ప్లేలోనే వికెట్ నష్టానికి 81 పరుగులు చేసింది. అయితే ఐపీఎల్ చరిత్రలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఇది హయ్యెస్ట్ పవర్ ప్లే స్కోర్ కావడం విశేషం. అంతేకాకుండా అత్యంత వేగంగా 100 పరుగులు నమోదు చేసిన నాలుగో జట్టుగా కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ చరిత్రకెక్కింది.

మయాంక్ అగర్వాల్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన ట్రావిస్ హెడ్‌‌కు హార్దిక్ పాండ్యా వేసిన రెండో ఓవర్ తొలి బంతికే లైఫ్ లభించింది. అతను ఇచ్చిన క్యాచ్‌ను టీమ్ డేవిడ్ నేలపాలు చేశాడు. ఈ అవకాశంతో చెలరేగిన అతను.. ఆకాశమే హద్దుగా చెలరేగాడు.

యువ బౌలర్ క్వెనా మఫకా వేసిన మూడో ఓవర్‌లో 6, 6, 4, 4 బాదిన హెడ్.. హార్దిక్ వేసిన ఐదో ఓవర్‌లో వరుసగా మూడు బౌండరీలు బాదాడు. కోయిట్జీ బౌలింగ్‌లో వరుసగా 4, 4, 6, 6 బాది 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివరకు కోయిట్జీ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.

Story first published: Wednesday, March 27, 2024, 20:32 [IST]
Other articles published on Mar 27, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+