For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2024: ఆ ముగ్గురిపై కన్నేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్!

హైదరాబాద్: ఐపీఎల్ 2024 సీజన్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ సమాయత్తమవుతోంది. ఇప్పటికే టీమ్ ప్రక్షాళనను ప్రారంభించిన ఆరెంజ్ ఆర్మీ.. ఈ ఏడాది డిసెంబర్‌లో జరగనున్న ఐపీఎల్ 2024 మినీ వేలం కోసం ప్రణాళికలను సిద్దం చేస్తోంది. కొత్త హెడ్ కోచ్, న్యూజిలాండ్ దిగ్గజం డానియల్ వెటోరి పర్యవేక్షణలో మినీ వేలానికి సిద్దమవుతోంది.

జట్టుకు భారమైన ఆటగాళ్లను వదులుకునేందుకు సిద్దమైన ఆరెంజ్ ఆర్మీ.. రిలీజ్ చేసే ఆటగాళ్ల జాబితాను ఇప్పటికే రెడీ చేసింది. కోట్లు కుమ్మరించిన కొనుగోలు చేసిన హ్యారీ బ్రూక్‌తో పాటు మయాంక్ అగర్వాల్‌ను వదులుకునేందుకు హైదరాబాద్ టీమ్ సిద్దమవుతోంది. ఈ ఇద్దర్నీ వదులుకుంటే సన్‌రైజర్స్ హైదరాబాద్‌‌ మనీ పర్స్‌కు రూ.21.5 కోట్ల డబ్బు చేరనుంది.

Sunrisers Hyderabad Team

ఈ డబ్బుతో కత్తిలాంటి ఆటగాళ్లను తీసుకోవచ్చని డానియల్ వెటోరి టీమ్‌మేనేజ్‌మెంట్‌కు వివరించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా టీమిండియా యువ స్టార్లపై అతను కన్నేసినట్లు జట్టు వర్గాలు పేర్కొన్నాయి. హైదరాబాద్ స్టార్ తిలక్ వర్మతో పాటు శుభ్‌మన్ గిల్, పృథ్వీ షాలను కొనుగోలు చేసేందుకు వెటోరి వ్యూహాలు రచించినట్లు తెలుస్తోంది.

Prithvi Shaw

ఈ ముగ్గురిలో ఒక్కరిని తీసుకున్నా జట్టుకు ఉపయోగపడుతుందని వెటోరి భావిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా శుభ్‌మన్ గిల్, పృథ్వీ షాలు తమ ఫ్రాంచైజీలను వీడుతారని ప్రచారం జరుగుతుండటంతో వీరికి భారీ ఆఫర్ ఇచ్చి జట్టులోకి తెచ్చుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గత సీజన్‌లో పృథ్వీ షా దారుణంగా విఫలమైన నేపథ్యంలో అతన్ని ఢిల్లీ క్యాపిటల్స్ వదులుకునే అవకాశం ఉంది.

Shubman Gill

అదే జరిగితే పృథ్వీ షా కోసం ఎంతకైనా తెగించాలని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫిక్స్ అయింది. మరోవైపు శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీ ఆఫర్ కోసం ఎదురు చూస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దాంతో అలర్ట్ అయిన సన్‌రైజర్స్.. అతన్ని జట్టులోకి తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే సన్‌రైజర్స్‌కు పంజాబ్ కింగ్స్ నుంచి పోటీ ఎదురవ్వనుంది.

Tilak Varma

శుభ్‌మన్ గిల్ పంజాబ్‌కు చెందిన వాడు కావడంతో లోకల్ సెంటిమెంట్‌తో అతన్ని జట్టులోకి తీసుకునే ప్రయత్నం ఆ జట్టు చేస్తోంది. ట్రేడింగ్ విండో ద్వారా ఈ ఇద్దరి ఆటగాళ్ల కోసం సన్‌రైజర్స్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తిలక్ వర్మ స్టార్ క్రికెటర్‌గా ఎదగడంతో ముంబై ఇండియన్స్ అతన్ని వదులుకునే అవకాశం లేదు.

మరోవైపు వెటోరి సత్తా కలిగిన కుర్రాళ్ల కోసం టాలెంట్ హంట్ కూడా నిర్వహిస్తున్నాడు. టీమ్‌కు చెందిన టాలెంట్ స్కౌట్స్ సాయంతో దేశవ్యాప్తంగా ప్రతిభాన్వేషణ కార్యక్రమం ప్రారంభించాడు.

Story first published: Monday, August 21, 2023, 19:28 [IST]
Other articles published on Aug 21, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+