Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2024: ఆ ముగ్గురిపై కన్నేసిన చెన్నై సూపర్ కింగ్స్!

హైదరాబాద్: ఐపీఎల్ 2024 సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ సమాయత్తమవుతోంది. ఈ ఏడాది డిసెంబర్‌లో జరగనున్న మినీ వేలం కోసం ప్రణాళికలను సిద్దం చేస్తోంది. ఇప్పటికే ఉద్వాసన పలికే ఆటగాళ్లతో ఓ జాబితాను కూడా సిద్దం చేసింది.

ఐపీఎల్ 2023 సీజన్‌లో ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్.. బలహీనతలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఆ జట్టు బౌలింగ్ విభాగం కాస్త బలహీనంగా ఉంది. ఈ క్రమంలోనే గాయంతో ఒక్క మ్యాచ్ ఆడని కైల్ జెమీసన్‌తో పాటు దారళంగా పరుగులిచ్చిన తుషార్ దేశ్‌పాండే, తరుచు గాయాల బారిన పడుతున్న దీపక్ చాహర్‌లను చెన్నై రిలీజ్ చేసే అవకాశం ఉంది.

ipl-2024-three-players-chennai-super-kings-can-target-in-the-auction

మగలాతో పాటు యువ ప్లేయర్లు భగత్ వర్మ, నిశాంత్ సంధు, అజయ్ మండల్‌లను కూడా రిలీజ్ చేయనుంది. ఇప్పటికే అంబటి రాయుడు రిటైర్మెంట్ ప్రకటించగా.. అజింక్యా రహానే విషయంలోనూ సీఎస్‌కే పునరాలోచన చేయనుంది. ఐపీఎల్ 2023 మినీ వేలంలో రూ.16.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌ను వదులుకునేందుకు కూడా చెన్నై మేనేజ్‌మెంట్ సిద్దమైంది.

వన్డే ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న బెన్ స్టోక్స్.. అప్‌కమింగ్ ఐపీఎల్‌కు దూరంగా ఉంటాడనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే చెన్నై సూపర్ కింగ్స్ అతన్ని వదులుకోవాలనుకుంటోంది. ఐపీఎల్ 2024 సీజన్ మినీ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ ప్యాట్ కమిన్స్‌తో పాటు సామ్‌కరన్, మనీశ్ పాండేలను కొనుగోలు చేసే అవకాశం ఉంది.

ipl-2024-three-players-chennai-super-kings-can-target-in-the-auction

1. సామ్ కరణ్..
ఐపీఎల్ 2023 సీజన్‌లో సామ్ కరణ్‌ను పంజాబ్ కింగ్స్ రూ.18.5 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. అయితే పంజాబ్ అంచనాలను అతను అందుకోలేకపోయాడు. 10 మ్యాచ్‌ల్లో కేవలం 10 వికెట్లు మాత్రమే తీసాడు. బ్యాటింగ్‌లోనూ 276 పరుగులే చేశాడు. ఈ క్రమంలోనే పంజాబ్ కింగ్స్ అతన్ని వదులుకునే అవకాశం ఉంది. అదే జరిగితే చెన్నై సూపర్ కింగ్స్ సామ్ కరణ్‌ను టార్గెట్ చేయనుంది.

ipl-2024-three-players-chennai-super-kings-can-target-in-the-auction

2.ప్యాట్ కమిన్స్..
బెన్ స్టోక్స్‌కు రిప్లేస్‌మెంట్‌గా ప్యాట్ కమిన్స్‌ను తీసుకునేందుకు చెన్నై వ్యూహాలు రచిస్తోంది. తీరిక లేని షెడ్యూల్ కారణంగా ఈ ఆసీస్ పేసర్ గతేడాది జరిగిన ఐపీఎల్ ఆడలేదు. గతంలో కేకేఆర్‌కు ప్రాతినిథ్యం వహించిన అతను అసాధారణ బౌలింగ్, బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు.

ipl-2024-three-players-chennai-super-kings-can-target-in-the-auction

3.మనీశ్ పాండే
ఐపీఎల్‌ చరిత్రలోనే తొలి సెంచరీ నమోదు చేసిన భారత ఆటగాడిగా రికార్డు ఉన్న మనీశ్ పాండే గత కొన్ని సీజన్లుగా దారుణంగా విఫలమవుతున్నాడు. ఈ క్రమంలోనే అతను సీజన్‌కు ఓ ఫ్రాంచైజీకి ఆడుతున్నాడు. గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ రూ.2.40 కోట్లకు అతన్ని కొనుగోలు చేయగా.. దారుణంగా విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే అతన్ని ఢిల్లీ వదిలేసే అవకాశం ఉంది.

అదే జరిగితే చెన్నై మనీశ్ పాండేను కొనుగోలు చేయనుంది. అంబటి రాయుడుకు రిప్లేస్‌మెంట్‌గా మనీశ్ పాండే సరైనోడని చెన్నై మేనేజ్‌మెంట్ భావిస్తోంది.

Story first published: Saturday, August 26, 2023, 17:11 [IST]
Other articles published on Aug 26, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+