Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2024: భారీ సిక్స్‌లు బాదుతున్న తెలుగోడు.. ప్రత్యర్ధులకు దబిడి దిబిడే!(వీడియో)

ఐపీఎల్ 2024 సీజన్ కోసం ముంబై ఇండియన్స్ బ్యాటర్, తెలుగు తేజం తిలక్ వర్మ సిద్దమవుతున్నాడు. వాంఖడే మైదానం వేదికగా జరుగుతున్న ముంబై ఇండియన్స్ ప్రీ సీజన్ ప్రాక్టీస్ క్యాంప్‌లో తిలక్ వర్మ ముమ్మరంగా సాధన చేస్తున్నాడు. సోమవారం నెట్ ప్రాక్టీస్ సెషన్‌లో భాగంగా భారీ సిక్స్‌లు ప్రాక్టీస్ చేశాడు.

బ్యాటింగ్ కోచ్ కీరన్ పోలార్డ్ పర్యవేక్షణలో బ్యాటింగ్ సాధన చేసిన తిలక్ వర్మ.. భారీ సిక్స్‌లు బాదాడు. తిలక్ వర్మ భారీ సిక్స్‌‌లకు సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.

IPL 2024 Telugu Player Tilak Varma slams huge sixes in nets during Mumbai Indian s training session

ఈ వీడియోలో తిలక్ వర్మ స్టెప్ ఔట్ అవుతూ.. రివర్స్ స్వీప్, స్వీప్ షాట్లతో పాటు నటరాజ్ షాట్స్‌తో భారీ సిక్స్‌లు బాదాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. తిలక్ వర్మ మరోసారి తన సత్తా ఏంటో చూపిస్తాడని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

దుమ్మురేపిన తెలుగోడు..
ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఈ క్యాష్ రిచ్ లీగ్‌లోకి అరంగేట్రం చేసిన తిలక్ వర్మ.. ఇప్పటి వరకు 25 మ్యాచ్‌లు ఆడి 144.53 స్ట్రైక్‌రేట్ 740 పరుగులు చేసాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ అసాధారణ ప్రదర్శనతో భారత జట్టులో చోటు దక్కించుకున్న అతను.. టీ20, వన్డే క్రికెట్‌లో అరంగేట్రం కూడా చేశాడు.

భారత్ తరఫున 15 ఇన్నింగ్స్‌ల్లో 139.41 స్ట్రైక్‌రేట్‌తో 336 రన్స్ చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇటీవల ముగిసిన దేశవాళీ క్రికెట్ టోర్నీ రంజీ ట్రోఫీ ప్లేట్ గ్రూప్‌లో హైదరాబాద్ జట్టును నడిపించిన తిలక్ వర్మ ఛాంపియన్‌గా నిలబెట్టాడు. మూడు సెంచరీలతో హైదరాబాద్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. టీమ్ డేవిడ్‌తో కలిసి ఐపీఎల్ 2024 సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరఫున మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేయనున్నాడు.

గుజరాత్ టైటాన్స్‌తో..
మార్చి 22 నుంచి ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభం కానుండగా.. 24న అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగే మ్యాచ్‌తో ముంబై ఇండియన్స్ తమ క్యాంపైన్‌ను ప్రారంభించనుంది.

Story first published: Monday, March 18, 2024, 16:30 [IST]
Other articles published on Mar 18, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+