IPL 2024: టైటిల్ గెలిచిన జెర్సీతో సన్‌రైజర్స్ హైదరాబాద్!
ఐపీఎల్ 2024 సీజన్‌కు సంబంధించిన కొత్త జెర్సీని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆవిష్కరించింది. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో తమ ఫ్రాంచైజీకి చెందిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జెర్సీనే ఐపీఎల్‌లో కొనసాగిస్తోంది. ఎయిడెన్ మార్క్‌రమ్ సారథ్యంలోని సన్‌రైజర్స్ ఈస్టెర్న్ కేప్ వరుసగా రెండు సీజన్లలో టైటిల్ గెలిచింది.
దాంతో తమకు అచ్చొచ్చిన జెర్సీనే ఐపీఎల్‌లో కొనసాగించాలని సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్‌మెంట్ నిర్ణయించింది. జెర్సీతో పాటు కిట్ మొత్తాన్ని ఐపీఎల్‌లో కొనసాగించనుంది. ఈ మేరకు గురువారం సన్‌రైజర్స్ జెర్సీని ఆవిష్కరించింది. సన్‌రైజర్స్ నయా జెర్సీని ధరించిన వెటరన్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఫొటోనూ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.

'మా కొత్త జెర్సీ ఇదే'అంటూ క్యాప్షన్‌గా పేర్కొంది. బ్లాక్ మాస్క్‌లతో కూడిన ఈ ఆరెంజ్ కలర్ జెర్సీపై అభిమానులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. జెర్సీలు మారిస్తే టైటిళ్లు రావని, మంచి కోర్ టీమ్‌పై ఫోకస్ పెట్టాలని కొందరంటే.. 'సౌతాఫ్రికా టీ20 లీగ్ జెర్సీ కావాలి గానీ.. మార్క్‌రమ్ మామ కెప్టెన్సీ వద్దా? ఇదెక్కడని న్యాయం?'అని సెటైర్లు పేల్చుతున్నారు.
ఐపీఎల్ 2024 సీజన్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా ప్యాట్ కమిన్స్‌ను నియమించిన విషయం తెలిసిందే. గతేడాది కెప్టెన్‌గా జట్టును నడిపించిన ఎయిడెన్ మార్క్‌రమ్‌ను సారథ్య బాధ్యతల నుంచి తప్పించింది. ఐపీఎల్ 2024 సీజన్ మినీ వేలంలో ప్యాట్ కమిన్స్‌ను రూ. 20.50 కోట్ల రికార్డు ధరకు కొనుగోలు చేసిన సన్‌రైజర్స్.. బ్యాటింగ్, బౌలింగ్ చేయడంతో పాటు వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ కావడంతో అతనికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది.
అయితే ప్యాట్ కమిన్స్‌కు ఐపీఎల్‌లో సరైన రికార్డు లేకపోవడం అభిమానులను కలవరపెడుతోంది. దేశీయ ఆటగాళ్లపై ఫోకస్ పెట్టకుండా విదేశీ ఆటగాళ్లపైనే సన్‌రైజర్స్ హైదరాబాద్ కోట్లు కుమ్మరించడంతో అభిమానులు పెద్దగా అంచనాలు పెట్టుకోవడం లేదు. గత 6 సీజన్లుగా సన్‌రైజర్స్ హైదరాబాద్ దారుణంగా విఫలమైంది. ముఖ్యంగా గత మూడు సీజన్లుగా పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగు స్థానంలో నిలిచింది.
ఇప్పటికే హైదరాబాద్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రాక్టీస్ క్యాంప్ ప్రారంభించగా.. కుర్రాళ్లంతా ఈ శిభిరంలో పాల్గొని ప్రాక్టీస్ చేస్తున్నారు. మార్చి 22 నుంచి ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభం కానుండగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ తొలి మ్యాచ్‌ను మార్చి 23న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications