Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2024 ఫైనల్లో ఓడినా.. చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్ హైదరాబాద్!

ఐపీఎల్ 2024 సీజన్ ఫైనల్లో ఓడినా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ చరిత్ర సృష్టించింది. అసాధారణ ప్రదర్శనతో ఐపీఎల్ చరిత్రలోనే కనివినీ ఎరుగని రికార్డులను నమోదు చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగడంతో బ్యాటింగ్ పరంగా సన్‌రైజర్స్ అసాధారణమైన ఘనతలను అందుకుంది.

ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మొత్తం 178 సిక్స్‌లు నమోదు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే ఓ సీజన్‌లో ఒక జట్టు ఇన్ని సిక్స్‌లు బాదడం ఇదే తొలిసారి. అంతేకాకుండా 287/3, 277/3 స్కోర్లతో టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లు నమోదు చేసిన జట్టుగా.. తొలి ఐపీఎల్ టీమ్‌గా ఘనతను అందుకుంది.

IPL 2024 Sunrisers Hyderabad shares SRH 2024 records

ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్ట్రైక్‌రేట్ కలిగిన ఓపెనింగ్ జోడీగా అభిషేక్ శర్మ-ట్రావిస్ హెడ్ ద్వయం నిలిచింది. ఈ ఇద్దరూ 220.2 స్ట్రైక్‌రేట్‌తో బౌలర్లకు చుక్కలు చూపించారు. పవర్ ప్లేలో 125 రన్స్ నమోదు చేసి అత్యధిక స్కోర్ నమోదు చేసిన జట్టుగా ఆరెంజ్ ఆర్మీ చరిత్రకెక్కింది. అంతేకాకుండా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అత్యంత వేగంగా 100 పరుగులు చేసిన టీమ్‌గానూ రికార్డు నమోదు చేసింది.

పవర్ ప్లేలో 11.2 రన్ రేట్‌తో బ్యాటింగ్ చేసిన తొలి జట్టుగానూ అరుదైన ఘనతను అందుకుంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో 167 లక్ష్యాన్ని 10 ఓవర్ల లోపే నమోదు చేసి సరికొత్త రికార్డు అందుకుంది. తొలి 10 ఓవర్లలోనే 167 పరుగులు చేసిన ఫస్ట్ టీమ్‌గా చరిత్రకెక్కింది.

ఈ సీజన్‌లో అభిషేక్ శర్మ 42 సిక్స్‌లతో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా నిలవగా.. ట్రావిస్ హెడ్ 64 ఫోర్లతో అత్యధిక బౌండరీలు బాదిన ప్లేయర్‌గా నిలిచాడు. ఈ రికార్డులన్నింటినీ గుర్తు చేస్తూ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓ పోస్టర్ రూపొందించింది. ఈ పోస్టర్‌ను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. టైటిల్ చేజారినా.. తమ విధ్వంసకర బ్యాటింగ్‌తో టీ20లకు సరికొత్త నిర్వచనం చెప్పిందని ఫ్యాన్స్ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

అసాధారణ బ్యాటింగ్‌తో రికార్డుల మోత మోగించిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. అసలు పోరులో మాత్రం తడబడింది. కేకేఆర్‌తో జరిగిన ఫైనల్లో పేలవ బ్యాటింగ్‌తో 113 పరుగులకే కుప్పకూలింది. దాంతో 8 వికెట్ల తేడాతో ఓటమిపాలై తృటిలో ఐపీఎల్ టైటిల్‌ను చేజార్చుకుంది. అంతేకాకుండా ఐపీఎల్ ఫైనల్స్ చరిత్రలోనే అత్యల్ప స్కోర్ నమోదు చేసిన జట్టుగా అప్రతిష్టను మూటగట్టుకుంది.

Story first published: Tuesday, May 28, 2024, 20:59 [IST]
Other articles published on May 28, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+