Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం.. హెడ్ కోచ్‌ బ్రియాన్ లారాపై వేటు!

హైదరాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2024 సీజన్ నేపథ్యంలో భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన ఆరెంజ్ ఆర్మీ ముందుగా హెడ్ కోచ్‌ బ్రియాన్ లారాపై వేటు వేయనున్నట్లు తెలుస్తోంది. లారా పనితీరుపై టీమ్ ఓనర్ కావ్య మారన్ ఆగ్రహంగా ఉన్నట్లు జట్టు వర్గాలు పేర్కొన్నాయి.

ఐపీఎల్ 2023 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ దారుణంగా విఫలమైంది. 14 మ్యాచ్‌ల్లో 4 విజయాలు మాత్రమే నమోదు చేసిన సన్‌రైజర్స్.. పాయింట్స్ టేబుల్‌లో చిట్టచివరి స్థానంలో నిలిచింది. ఐపీఎల్ చరిత్రలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఇది అత్యంత చెత్త ప్రదర్శన. జట్టు వైఫల్యాన్ని బ్రియాన్ లారా కోచింగ్ తీరే కారణమని మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు విమర్శలు గుప్పించారు.

 IPL 2024: Sunrisers Hyderabad set to axe Brian Lara After Below-Par IPL 2023

ప్రతీ మ్యాచ్‌కు మార్పులు చేయడం.. పదే పదే బ్యాటింగ్ ఆర్డర్ మార్చడం టీమ్ విజయవకాశాలను దెబ్బతీసిందని మండిపడ్డారు. సన్‌రైజర్స్ కెప్టెన్ మార్క్‌రమ్ కూడా బ్రియాన్ లారా నిర్ణయాలపై పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేశాడు. టీమ్ సెలెక్షన్.. కీలక నిర్ణయాలు తీసుకునే విషయంలో తనకు స్వేచ్చ లేకుండా పోయిందని బాహటంగానే చెప్పాడు.

మ్యాచ్ జరుగుతున్న సమయంలోనూ మార్క్‌రమ్ కెప్టెన్‌గా ఉన్నా.. డగౌట్‌లో ఉన్న బ్రియాన్ లారా పదే పదే సలహాలు ఇవ్వడం కనిపించింది. అతని ప్రణాళికలు, సలహాలు బెడిసి కొట్టడంతో సన్‌రైజర్స్ ఘోర పరాజయం చవిచూసింది. వాస్తవానికి బ్రియాన్ లారాకు కోచింగ్ చేసిన అనుభవం లేదు. ఐపీఎల్ 2022 సీజన్ సందర్భంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు బ్యాటింగ్ కన్సల్టంట్‌గా.. సలహాదారుడిగా పని చేశాడు.

ఐపీఎల్ 2023 సీజన్ ముంగిట టామ్ మూడీ తప్పుకోవడంతో కోచింగ్ బాధ్యతలను తీసుకున్నాడు. కానీ తన మార్క్‌ను చూపించకపోగా.. జట్టు పరువు తీసాడు. కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను పక్కనపెట్టేసాడు. హ్యారీ బ్రూక్ వంటి ఆటగాళ్లపై కోట్లు కుమ్మరించి చేతులు కాల్చుకున్నాడు. టెస్ట్ బ్యాటర్లను నమ్ముకొని జట్టు ఘోర పరాజయానికి కారణమయ్యాడు.

ఈ క్రమంలోనే బ్రియాన్ లారాను పక్కనపెట్టేసి ఇతర కోచ్‌ను నియమించాలని సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ భావిస్తోందని జట్టుకు చెందిన ఓ అధికారి తెలిపాడు. కొత్త కోచ్ కోసం అన్వేషణ కూడా మొదలుపెట్టిందని పేర్కొన్నాడు.

Story first published: Tuesday, July 18, 2023, 10:36 [IST]
Other articles published on Jul 18, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+